వరల్డ్ క్యాన్సర్ డే 2025: క్యాన్సర్ రాకుండా ఉండాలంటే..?
సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను తీస్తున్న వ్యాధి క్యాన్సర్. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ) గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. క్యాన్సర్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. దీనికి కారణాలు జీవనశైలిలో మార్పులు, కాలుష్యం, పొగాకు,మద్యపానం, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం. ఈ అంశాలన్నింటి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం,ఈ వ్యాధిని నివారించడానికి వారికి సరైన సమాచారం, వనరులను అందించడం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ లక్ష్యం.
ఇది కూడా చదవండి..మధుమేహం అదుపులో ఉండడంలేదా..? ఈటిప్స్ ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి..పిల్లలకు ఇచ్చే రెండు వేర్వేరు వ్యాక్సిన్‌ల మధ్య గ్యాప్ ఎంత ఉండాలి..?
ఇది కూడా చదవండి..వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..వైట్ లంగ్ సిండ్రోమ్ లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలకు సరైన పరిష్కారాలు..
ఈ ఏడాది ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డేను జరుపుతున్నారు. క్యాన్సర్ లక్షణాలు, రోగ నిర్ధారణ, చికిత్స, నివారణ గురించి ప్రజలకు సమాచారం అందించడమేకాకుండా, ఈ రోజున క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులకు సంఘీభావం అందిస్తారు.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025 థీమ్..
ప్రతి సంవత్సరం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఒక ప్రత్యేక థీమ్ తో జరుపుకుంటారు. ఈ థీమ్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాటంలో కొత్త లక్ష్యాలను దిశను నిర్దేశిస్తుంది. 2025 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం థీమ్ "యునైటెడ్ బై యునైక్". క్యాన్సర్‌ను కేవలం చికిత్స ద్వారా ఓడించలేమని, ప్రజలతో కలిసి పోరాడి, దాని మూలాల నుంచి నిర్మూలించాల్సిన యుద్ధం అని ప్రజలకు అర్థమయ్యేలా చేయడమే ఈ ఏడాది థీమ్ లక్ష్యం. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాటంలో ప్రతి వ్యక్తి సహకరించాలని ఈ థీమ్ నొక్కి చెబుతుంది.
క్యాన్సర్ పై అవగాహన అవసరం..
క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి వ్యాధి, దీనిని ముందుగానే గుర్తిస్తే నయం చేయవచ్చు. అయితే ముందుగా గుర్తించాలంటే క్యాన్సర్ లక్షణాల గురించి ప్రజలకు తెలియదు, దీని కారణంగా వ్యాధి ముదురుతుంది. చికిత్స కష్టమవుతుంది. అందువల్ల, క్యాన్సర్ అవగాహన పెంచడం చాలా ముఖ్యం.
క్యాన్సర్ లక్షణాలు ఇవే..
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ద్వారా, ఆకస్మిక బరువు తగ్గడం, దీర్ఘకాలిక దగ్గు లేదా గొంతు నొప్పి, శరీరంలో గడ్డలు, అలసట, చర్మ మార్పులు వంటి క్యాన్సర్ లక్షణాలు అందరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. అలాగే, క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవాలని ,ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.
క్యాన్సర్ నివారణ చర్యలు..
క్యాన్సర్‌ను నివారించడానికి కొన్ని ముఖ్యమైన చర్యలు ఉన్నాయి, వీటిని పాటించడం ద్వారా ఈ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు. పొగాకు, మద్యం మానేయాలి : పొగాకు ఉత్పత్తులను వాడడం, మద్యం సేవించడం అనేవి క్యాన్సర్‌కు దారితీసే ప్రధాన కారణాలు. వీటికి దూరంగా ఉండటం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన రెడ్ మీట్ వినియోగాన్ని నివారించాలి.
ఇది కూడా చదవండి..ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్త ప్రసరణపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ కు మెనోపాజ్ కు లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
