Stress Control : ఈ చిన్న అలవాటుతో ఒత్తిడిని కట్టడి చేయవచ్చు..! : తాజా పరిశోధనలు 

సాక్షి లైఫ్ : ప్రజెంట్ జనరేషన్ ఉరుకుల పరుగుల జీవితంలో నెట్టుకుపోతోంది. దీని కారణంగా మానసిక ఒత్తిడి (Stress) సర్వసాధారణమైపోయింది. పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, ఆందోళనలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు.. వీటన్నింటికీ పరిష్కారం కేవలం ఒక చిన్న అలవాటులో ఉందని నిపుణులు చెబుతున్నారు. అదే 'నడక'. రోజువారీ దినచర్యలో భాగం చేసుకునే ఈ చిన్న మార్పు, మన శరీరంలో ఒత్తిడిని కలిగించే 'కార్టిసోల్' (Cortisol) హార్మోన్ స్థాయిలను అద్భుతంగా తగ్గిస్తుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..?

 

కార్టిసోల్ కట్టడికి..

శరీరంలో 'కార్టిసోల్' స్థాయిలు పెరిగితే ఆందోళన, నిద్రలేమి, మెదడు మొద్దుబారడం (Brain Fog) వంటి సమస్యలు తలెత్తుతాయి. నడక వల్ల శరీరంలో 'ఎండార్ఫిన్లు' అనే సంతోషాన్నిచ్చే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి సహజసిద్ధంగానే కార్టిసోల్ ప్రభావాన్ని తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ శిక్షకురాలు లూసీ కోవన్ అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ నడవడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు దరిచేరవు.

సృజనాత్మకత.. 

నడక కేవలం శరీరానికే కాదు, మెదడుకూ పదును పెడుతుంది. జర్నల్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంటల్ సైకాలజీ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. నడక వల్ల సృజనాత్మకత (Creativity) దాదాపు 60 శాతం పెరుగుతుంది. క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు ఆలోచించాలన్నా, కొత్త ఆలోచనలు రావాలన్నా కాసేపు అలా నడవడం ఉత్తమమని పరిశోధకులు సూచిస్తున్నారు.

ఎంతసేపు నడవాలి..?

అత్యధిక ప్రయోజనం పొందడానికి గంటల తరబడి శ్రమించాల్సిన అవసరం లేదు.  ప్రకృతి ఒడిలోగానీ  పార్కులు లేదా చెట్లు ఉన్న చోట గానీ 20 నుంచి 30 నిమిషాల పాటు నడిస్తే శరీరంలో కార్టిసోల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని 2019 నాటి ఒక అధ్యయనం పేర్కొంది. సమయం లేని వారు కనీసం ఐదు నిమిషాల పాటు నడిచినా మూడ్ మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

చిన్న మార్పులతో మొదలుపెట్టండి..

నడకను భారంగా కాకుండా, అలవాటుగా మార్చుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.  ఆఫీసులో లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కడం. మాల్స్ లేదా ఆఫీసుల వద్ద కారును కాస్త దూరంగా పార్క్ చేసి నడిచి వెళ్లడం. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అటు ఇటు నడవడం. కేవలం అడుగుల సంఖ్య పెంచడం ద్వారా గుండె ఆరోగ్యం, కీళ్ల పటుత్వం మెరుగుపడటమే కాకుండా.. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : stress stress-mind stress-relieving-foods walking stress-management stress-hormone stress-relief reduce-stress stress-reduction
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com