సాక్షి లైఫ్ : ప్రతి ఏటా నవంబర్ 19వతేదీన ప్రపంచవ్యాప్తంగా 'ప్రపంచ టాయిలెట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇలా జరుపుకోవడానికి ప్రధాన కారణం, ప్రపంచవ్యాప్తంగా పారిశుధ్యం, పరిశుభ్రత సౌకర్యాల గురించి అవగాహన పెంచడం. మరుగుదొడ్ల ప్రాముఖ్యత కేవలం సౌకర్యానికి సంబంధించినది కాదు, ఇది నేరుగా మానవ ఆరోగ్యం, గౌరవం (Dignity) పర్యావరణ పరిరక్షణకు ముడిపడి ఉంది. అంతేకాదు శుభ్రమైన టాయిలెట్ అనేది ప్రతి వ్యక్తి , ప్రాథమిక హక్కు, ఆరోగ్యవంతమైన సమాజానికి తొలి మెట్టు..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
సురక్షితమైన మరుగుదొడ్లకు ప్రాధాన్యత..
బహిరంగ మల విసర్జన (Open Defecation) వల్ల కలిగే తీవ్రమైన అనారోగ్య సమస్యలను గురించి తెలియజేయడమే లక్ష్యంగా టాయిలెట్ డేని నిర్వహిస్తున్నారు. మరుగుదొడ్లు లేకపోవడం వలన ముఖ్యంగా మహిళలు ,బాలికలు ఎదుర్కొనే భద్రత, గౌరవ సమస్యలను ఎత్తి చూపడం. సరైన పారిశుధ్య వ్యవస్థలు శుభ్రమైన నీటి వనరులను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
సమస్య ఎంత తీవ్రంగా ఉంది..?
ఐక్యరాజ్యసమితి (UN) గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కోట్ల మంది ప్రజలకు సురక్షితమైన, శుభ్రమైన మరుగుదొడ్లు అందుబాటులో లేవు. సరైన మరుగుదొడ్లు లేకపోవడం వల్ల మురుగు నీరు,మానవ వ్యర్థాలు నేరుగా పర్యావరణంలోకి కలిసిపోతాయి.
ఈ కలుషితమైన నీరు, పరిసరాల ద్వారా కలరా, టైఫాయిడ్, విరేచనాలు (Diarrhea) వంటి అనేక ప్రాణాంతక వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. ముఖ్యంగా, ఐదేళ్ల లోపు పిల్లల మరణాలకు పారిశుధ్య లోపం ఒక ముఖ్య కారణంగా మారుతోంది.
భారతదేశంలో 'స్వచ్ఛ భారత్' పాత్ర..
భారతదేశంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్ (Swachh Bharat Mission) ఈ రంగంలో గణనీయమైన మార్పు తీసుకురావడానికి కృషి చేసింది. బహిరంగ మల విసర్జన రహిత (ODF - Open Defecation Free) స్థితిని సాధించడం, మరుగుదొడ్ల నిర్మాణం, వాటి వినియోగాన్ని ప్రోత్సహించడం ఈ మిషన్ లక్ష్యాలు.
ప్రపంచ టాయిలెట్ దినోత్సవం కేవలం మరుగుదొడ్ల గురించి మాత్రమే కాదు. ఇది సమగ్రమైన పారిశుద్ధ్య వ్యవస్థ ఆవశ్యకత గురించి మనకు గుర్తు చేస్తుంది. పారిశుధ్యం మెరుగుపడితే, ప్రజారోగ్యం మెరుగుపడుతుంది, వ్యాధులు తగ్గుతాయి, తద్వారా ఆర్థిక అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది.
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com