Acupuncture therapy : డయాబెటిస్ నిర్వహణలో ఆక్యుపంక్చర్ థెరపీ ఎలా పనిచేస్తుంది..? 

సాక్షి లైఫ్: డయాబెటిస్ (Diabetes) నిర్వహణలో ఆక్యుపంక్చర్ థెరపీ సానుకూల ప్రభావాన్ని చూపుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆక్యుపంక్చర్ ద్వారా గ్లూకోజ్ స్థాయిల మెరుగు పరుచవచ్చు. శరీరంలోని నిర్దిష్ట పాయింట్ల వద్ద సన్నని సూదులను గుచ్చడం (Acupuncture) ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు (Blood Glucose Levels) మెరుగవుతున్నట్లు కొన్ని అధ్యయనాలలో తేలింది.

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుదల: ఆక్యుపంక్చర్ చికిత్స ఇన్సులిన్ నిరోధకతను (Insulin Resistance) తగ్గించి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని (Insulin Sensitivity) పెంచడంలో సహాయపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు. దీనివల్ల శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతుంది. మధుమేహం తీవ్రమైతే వచ్చే నాడీ సమస్య (డయాబెటిక్ న్యూరోపతి) లక్షణాల నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఆక్యుపంక్చర్ ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఇన్సులిన్, గ్లూకోకార్టికాయిడ్ వంటి మధుమేహాన్ని ప్రభావితం చేసే హార్మోన్ల సమతుల్యతను సరిచేయడంలో ఆక్యుపంక్చర్ సహాయ పడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆక్యుపంక్చర్ థెరపీ మధుమేహానికి సంపూర్ణ నివారణ (Cure) కాదు. ఇది ప్రధాన చికిత్సకు సహాయకారి (Adjuvant Therapy) మాత్రమే.

మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ముందుగా ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అత్యవసరం. మీరు డయాబెటిస్ చికిత్సలో భాగంగా ఆక్యుపంక్చర్ తీసుకోవాలని అనుకుంటే, ముందుగా ఎండోక్రినాలజిస్ట్ ను సంప్రదించి, వారి సలహా మేరకు మాత్రమే ఈ చికిత్స తీసుకోవాలి. ముఖ్యంగా నిపుణులైన ఆక్యుపంక్చర్ థెరపిస్ట్ ద్వారానే చికిత్స తీసుకోవడం ఉత్తమం.

 

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : diabetes diabetes-affect type-2diabetes diabetes-risk diabetes-patients best-diabetes-diet acupuncture acupuncture-treatment acupuncture-method how-to-beat-diabetes prediabetes-symptoms what-is-diabetes preventing-pre-diabetes prediabetes-range
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com