సాక్షి లైఫ్ : పేగుఆరోగ్యాన్ని (Gut health) మానిటర్ చేయడానికి శాస్త్రవేత్తలు సరికొత్త పరికరాన్ని కనుగొన్నారు. దీనిని సాధారణంగా 'పూప్ కెమెరా' (Poo Camera) లేదా అడ్వాన్స్‌డ్ టాయిలెట్ మానిటరింగ్ సిస్టమ్ అని పిలుస్తున్నారు. మల విసర్జన తీరును స్కాన్ చేసి, జీర్ణవ్యవస్థ (Digestive System) పూర్తిస్థాయి శారీరక ఆరోగ్య నివేదికను ఇది అందిస్తుంది. ఎలాంటి వైద్య పరీక్షలు లేకుండానే ప్రతిరోజూ ఆరోగ్యంపై దృష్టి సారించడానికి ఇది సహాయపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
'టాయిలెట్ కెమెరా' ఎలా పనిచేస్తుంది అంటే..?
గట్ హెల్త్ (Gut Health) లేదా పేగు ఆరోగ్యం అనేది మన శరీరంలో రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యం, జీర్ణక్రియతో ముడిపడి ఉంటుంది. దీనిని పర్యవేక్షించడానికి సాధారణంగా ల్యాబ్ పరీక్షలు చేయవలసి ఉంటుంది. అయితే, ఈ కొత్త 'పూప్ కెమెరా' సాంకేతికత ద్వారా ఇంట్లో ఉండే టాయిలెట్‌ను ఆధునిక ఆరోగ్య కేంద్రంగా మార్చవచ్చని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
ఈ వ్యవస్థను మీ టాయిలెట్ లోపల లేదా టాయిలెట్ అంచున ఇన్‌స్టాల్ చేస్తారు. మల విసర్జన జరిగిన వెంటనే, అధిక రిజల్యూషన్ ఉన్న కెమెరా ఆ వ్యర్థాన్ని స్కాన్ చేస్తుంది. ఈ కెమెరా సేకరించిన విజువల్స్ , సెన్సార్ డేటాను కృత్రిమ మేధస్సు (AI) అల్గారిథమ్‌ల ద్వారా విశ్లేషిస్తారు. విశ్లేషణ పూర్తయిన తర్వాత, మలం ఆకారం, రంగు, పరిమాణం, ఇతర లక్షణాల ఆధారంగా జీర్ణవ్యవస్థ పనితీరు, ఆరోగ్యం గురించి పూర్తి రిపోర్టు మొబైల్ యాప్ నకు వస్తుంది.
పూర్తి హెల్త్ రిపోర్ట్..
ఈ అధునాతన వ్యవస్థ కేవలం రంగును మాత్రమే కాకుండా, జీర్ణవ్యవస్థ గురించి అనేక కీలక సమాచారాన్ని అందిస్తుంది. మలం స్థిరత్వాన్ని బట్టి శరీరంలో నీటి స్థాయిలను అంచనా వేస్తుంది. ఆహారం జీర్ణం అయ్యే వేగం గురించి సమాచారం ఇస్తుంది. ఏదైనా అసాధారణ మార్పు అంటే..? ఉదాహరణకు, రక్తం ఆనవాళ్లు లేదా విపరీతమైన రంగు మార్పు గుర్తిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలని హెచ్చరిస్తుంది. ప్రతిరోజు డేటాను సేకరించి, కాలక్రమేణా మీ జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులను పర్యవేక్షిస్తుంది.
రోజువారీ మల విసర్జనను ట్రాక్ చేయడం ద్వారా పేగు సమస్యలను, కొన్ని రకాల క్యాన్సర్‌లను, ఇతర జీర్ణ సంబంధిత రుగ్మతలను ప్రారంభ దశలోనే గుర్తించడానికి ఈ 'టాయిలెట్ ఇంటెలిజెన్స్' (Toilet Intelligence) సాంకేతికత ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com