సాక్షి లైఫ్ : క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (Chronic Obstructive Pulmonary Disease- COPD) అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక తీవ్రమైన జబ్బు. ఈ వ్యాధిలో శ్వాస మార్గంలో దీర్ఘకాలికంగా అడ్డంకులు ఏర్పడి, మెల్లమెల్లగా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. సాధారణంగా దీనికి ధూమపానం ప్రధాన కారణమని భావిస్తారు, కానీ వాస్తవం ఇంకా క్లిష్టంగా ఉందని ధూమపానం మాదిరిగానే మన చుట్టూ ఉన్న విషపూరితమైన గాలి కూడా ఈ ప్రమాదాన్ని మరింతగా పెంచుతోందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఊపిరితిత్తులకు కాలుష్యం వల్ల కలిగే నష్టం.. !
మనం దీర్ఘకాలం పాటు కలుషితమైన గాలిని పీల్చడం వల్ల మన ఊపిరితిత్తులలో నిరంతరం వాపు (Inflammation) ఏర్పడుతుంది. PM2.5, PM10 వంటి సూక్ష్మ కణాలు, వాహనాల పొగ, ఫ్యాక్టరీల రసాయనాలు, ఇళ్లలో వంట కోసం వినియోగించే కలప, బొగ్గు వంటి బయోమాస్ పొగ.. ఇవన్నీ నెమ్మదిగా ఊపిరితిత్తులను బలహీనపరుస్తాయి.
ఈ నష్టం వెంటనే కనిపించకపోయినా, కాలక్రమేణా ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోతుంది, ఆయాసం పెరుగుతుంది, త్వరగా అలసిపోవడం జరుగుతుంది.
ముఖ్యంగా, చలికాలంలో గాలి నాణ్యత మరింత దెబ్బతినడం వల్ల సీఓపీడీ తీవ్రత అకస్మాత్తుగా పెరుగుతుంది. ఈ సమయంలో, రోగులు తీవ్రమైన శ్వాస సమస్యలతో అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరవలసి వస్తుంది.
సీఓపీడీ కేవలం స్మోకర్లకే కాదు, ఇంట్లో ఉండే వారికీ ముప్పు..!
సీఓపీడీ కేవలం ధూమపానం చేసేవారికి మాత్రమే వస్తుందనేది అపోహ. భారతదేశంలో దాదాపు మూడోవంతు సీఓపీడీ కేసులకు కారణం ఇండోర్ స్మోక్ (Indoor Smoke) బయటి కాలుష్యం అని డాక్టర్లు చెబుతున్నారు. అంటే, ఇళ్లలో వంట పొగ, సరైన వెంటిలేషన్ లేకపోవడం, లేదా చుట్టుపక్కల కాలుష్యం కూడా సిగరెట్ పొగ అంత హాని కలిగించగలవు.
ఎలాంటి వారికి ముప్పు మరింత ఎక్కువ అంటే..?
కొన్ని వర్గాల ప్రజలపై కాలుష్య ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. వృద్ధులు, ఉబ్బసం (Asthma) లేదా దీర్ఘకాలిక దగ్గు ఉన్నవారు, బయట ఎక్కువసేపు పనిచేసే ఉద్యోగులు, పిల్లలు, తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
సీఓపీడీ నుంచి రక్షణకు చర్యలు..
ఈ పెరుగుతున్న ప్రమాదాన్ని తగ్గించడానికి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన చర్యలు చాలాఉన్నాయి. వంట కోసం ఎల్‌పీజీ (LPG) లేదా విద్యుత్ ఆధారిత సాధనాలను వాడాలి. కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో బయటకు వెళ్ళినప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించాలి. ముఖ్యంగా ఎక్కువ సమయం కాలుష్యంలో గడిపేవారు రెగ్యులర్ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. మీ పరిసరాల్లో మొక్కలు పెంచడం, పొగ వచ్చే వనరులను తగ్గించడం.
ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలి. మన ఊపిరితిత్తుల ఆరోగ్యం మన వ్యక్తిగత అలవాట్లపైనే కాదు, మనం పీల్చే గాలి నాణ్యతపై కూడా ఆధారపడి ఉంటుంది. కాలుష్యాన్ని తగ్గించడం అనేది పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాదు, కోట్ల మంది ప్రజల ప్రాణాలను కాపాడడమూ ముఖ్యమే.
ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com