మీరు చికెన్ లివర్ తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాలి..
సాక్షి లైఫ్ : చాలామంది చికెన్ తినడానికి ఇష్టంగా తింటారు. కానీ చికెన్ కాలేయాన్ని తినడానికి పెద్దగా ఇష్టపడరు. ఐతే చికెన్ ఇతర భాగాలను తినడం కంటే చికెన్ కాలేయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చికెన్ లివర్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?
ఇది కూడా చదవండి.. హెల్తీ డైట్: పిల్లల పెరుగుదలకు సహాయపడే ఆహారం..
ఇది కూడా చదవండి.. కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?
విటమిన్లు, ఖనిజాలు..
చికెన్ కాలేయంలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అంతేకాదు ఇందులో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల కాలేయంలో 17 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. చికెన్ లివర్ మన కాలేయాన్ని కూడా కాపాడుతుంది. రక్తహీనత వంటి సమస్యలతో బాధపడేవారికి చికెన్ లివర్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ బి12 రక్తహీనతతో పోరాడుతుంది.
కంటి చూపును మెరుగుపరుస్తుంది. మన చెడు ఆహారపు అలవాట్ల వల్ల తరచుగా కంటి చూపు తగ్గుతుంది. చికెన్ లివర్ లో లైకోపీన్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కంటి చూపును పెంచుతాయి. ఇందులో విటమిన్ "ఏ" కూడా పుష్కలంగా ఉంటుంది.
శరీర కణజాలానికి ఉపయోగపడుతుంది. కోడి కాలేయంలోని రిబోఫ్లావిన్ శరీర కణజాలాలలో సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. శరీరంలో ఇది లోపిస్తే శరీరంలో రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.
సంతానలేమి సమస్య..
సంతానలేమిని తొలగిస్తుంది. కాలేయాన్ని తీసుకోవడం వల్ల కూడా సంతానలేమి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇది సంతానోత్పత్తిని పెంచుతుంది. ఇది పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది.ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడి అనేది నేటి జీవనశైలి భాగమైంది. కానీ చికెన్ లివర్ తినడం ద్వారా దీనిని కొంత వరకు తొలగించవచ్చు.
బరువు తగ్గాలనుకునే వారు చికెన్ లివర్ తమ రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఎందుకంటే 100 గ్రాముల కాలేయంలో 116 కేలరీలు మాత్రమే ఉంటాయి. పిల్లలకు అధిక శక్తి అవసరం. పిల్లలలో రక్తహీనతను నయం చేయడంలో కాలేయం సహాయపడుతుంది. చికెన్ లివర్ లో విటమిన్ "ఏ", విటమిన్ "బి12", సెలీనియం, కాపర్, ఫోలిక్ యాసిడ్ ఐరన్ వంటివి ఉంటాయి.
ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ఇది కూడా చదవండి.. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.