సాక్షి లైఫ్ : ఎండలు ముదురుతున్న వేళ.. దాహార్తిని తీర్చుకోవడానికే కాకుండా శరీరాన్ని చల్లబరచడానికి మనందరికీ ముందుగా గుర్తొచ్చేది కీర దోసకాయ. నీటి శాతం పుష్కలంగా ఉండే ఈ కాయలు వడదెబ్బ నుంచి రక్షణ కల్పించడమే కాకుండా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. అయితే, ప్రస్తుతం మార్కెట్లో రంగురంగుల, ఆకర్షణీయమైన కీర దోసకాయలు కనువిందు చేస్తున్నాయి. వీటిలో ఏవి సహజంగా పండినవి..? ఏవి రసాయనాలతో కూడిన హైబ్రిడ్ రకాలు..? అనేది గుర్తించడం వినియోగదారులకు సవాలుగా మారింది. రుచి, ఆరోగ్యం రెండూ దక్కాలంటే కీరదోసకాయల ఎంపికలో ఆయా లక్షణాలను బట్టి తేడాలను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
రంగు, ఆకృతిని గమనించండి..
సేంద్రీయ (Organic)..
సహజ పద్ధతుల్లో పండిన దోసకాయలు సాధారణంగా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటి ఉపరితలం కొద్దిగా గరుకుగా, చారలు కలిగి లేదా అసమానంగా ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా పెరగడం వల్ల ఇవి చూడటానికి అంత నునుపుగా ఉండవు.
హైబ్రిడ్ (Hybrid)..
ఇవి ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి, పైన ఎంతో నునుపుగా, మెరుస్తూ కనిపిస్తాయి. రసాయన ఎరువులు, నియంత్రిత సాగు పద్ధతుల వల్ల ఇవి చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.
ఆకారంలో వ్యత్యాసాలు..
సహజంగా పెరిగే దోసకాయలు అన్నీ ఒకే పరిమాణంలో లేదా ఒకే ఆకారంలో ఉండవు. కొన్ని వంకరగా లేదా చిన్నవిగా ఉండవచ్చు. ఇది అవి సహజ సిద్ధంగా పెరిగాయని చెప్పడానికి ఒక గుర్తు. అదే హైబ్రిడ్ రకాలను గమనిస్తే, అవన్నీ దాదాపు ఒకే పొడవు, ఒకే ఆకృతితో యూనిఫాంగా ఉంటాయి.
రుచి.. గింజల తీరు..
సేంద్రీయ కీర దోసకాయలు తిన్నప్పుడు మంచి తాజాదనంతో పాటు స్వల్ప తీపి రుచిని కలిగి ఉంటాయి. హైబ్రిడ్ కాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, రుచి మాత్రం చప్పగా ఉండే అవకాశం ఉంది. సహజంగా పండిన కీర దోసకాయల్లో గింజలు మెత్తగా ఉండి సులభంగా తినేలా ఉంటాయి. హైబ్రిడ్ రకాల్లో కొన్నిసార్లు గింజలు చాలా తక్కువగా ఉండటం లేదా లోపలి గుజ్జు ఎక్కువగా నీరుగా ఉండటం గమనించవచ్చు.
ఆరోగ్యమే ప్రధానం..!
రసాయనాలతో పండించిన హైబ్రిడ్ కాయల కంటే, సహజ సిద్ధమైన ఎరువులతో పండించిన సేంద్రీయ దోసకాయలు ఆరోగ్యానికి శ్రేయస్కరం. మార్కెట్లో కొనుగోలు చేసేటప్పుడు కేవలం ఆకర్షణీయమైన రంగు, మెరుపును చూసి మోసపోకుండా.. పైన పేర్కొన్న అంశాలను బేరీజు వేసుకుంటే స్వచ్ఛమైన ఆహారాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..న్యూరోసర్జన్లు వెన్నెముక శస్త్రచికిత్స చేయడానికి కూడా అర్హులే
ఇది కూడా చదవండి..పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com