Anesthesia Secrets : అనస్థీషియా పుట్టుక వెనుక రహస్యాలు మీకు తెలుసా..? 

సాక్షి లైఫ్ : ఆపరేషన్ అనగానే ఒకప్పుడు వెన్నులో వణుకు పుట్టేది. రోగిని బంధించి, కత్తులతో కోస్తుంటే ఆ నరకయాతన వర్ణనాతీతం. కానీ, నేడు ఆ పరిస్థితి మారిపోయింది. శస్త్రచికిత్స అంటే ఓ చిన్నపాటి కునుకు తీయడం లాంటిదే..! భరించలేని ఆ వేదన నుంచి మానవాళిని విముక్తి చేసిన ఆ అనస్థీషియా మత్తు మందు పుట్టుక వెనుక దాగి ఉన్న రహస్యాలు ఏంటో మీకు తెలుసా..? 1842 మార్చి 30న జరిగిన ఆ అద్భుత ప్రయోగం.. వైద్య చరిత్రను ఎలా మలుపు తిప్పిందో చదవండి..

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

 

వినోదం నుంచి పుట్టిన విప్లవం.. 

పంతొమ్మిదో శతాబ్దంలో 'ఈథర్' అనే రసాయనాన్ని చికిత్స కోసం కాకుండా వినోదం కోసం వాడేవారు. అమెరికాలోని యువత ఈథర్ పీల్చి మత్తులో ఊగిపోతూ 'ఈథర్ ఫ్రోలిక్స్' పేరుతో పార్టీలు చేసుకునేవారు. సరిగ్గా అలాంటి ఒక వేడుకలోనే డాక్టర్ క్రాఫోర్డ్ లాంగ్ ఒక వింతను గమనించారు. మత్తులో ఉన్న వ్యక్తులు కింద పడినా, గాయపడినా వారికి ఏమాత్రం నొప్పి తెలియడం లేదని ఆయన గుర్తించారు. ఈ చిన్న పరిశీలనే ఆధునిక వైద్యశాస్త్రంలో ఒక మహా విప్లవానికి పునాది వేసింది.

చరిత్ర సృష్టించిన ఆపరేషన్.. 

జార్జియాకు చెందిన డాక్టర్ లాంగ్ తన పరిశీలనను రోగులపై ప్రయోగించాలని నిశ్చయించుకున్నారు. 1842 మార్చి 30న జేమ్స్ వెనబుల్ అనే వ్యక్తి మెడపై ఉన్న కణితిని తొలగించేందుకు సిద్ధమయ్యారు. అప్పట్లో అనస్థీషియా లేకుండా కోత పెట్టడమంటే రోగి ప్రాణాలతో నరకం చూడాల్సిందే. కానీ డాక్టర్ లాంగ్, జేమ్స్‌తో ఈథర్‌ను పీల్చింపజేశారు. రోగి గాఢ నిద్రలోకి వెళ్లగానే ఎంతో సునాయాసంగా కణితిని తొలగించారు. స్పృహలోకి వచ్చిన జేమ్స్.. తనకు అసలు నొప్పే తెలియలేదని చెప్పడంతో వైద్యలోకం ఆశ్చర్యపోయింది.

గుర్తింపు కోసం పోరాటం.. 

డాక్టర్ లాంగ్ ఈ విజయాన్ని వెంటనే ప్రపంచానికి చాటలేదు. అయితే 1846లో విలియం మోర్టన్ అనే దంతవైద్యుడు బోస్టన్‌లో ఈథర్ ప్రభావాన్ని బహిరంగంగా ప్రదర్శించడంతో ఈ పద్ధతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. కాలక్రమేణా, తొలి ప్రయోగం చేసిన ఘనత డాక్టర్ లాంగ్‌కే దక్కింది. ఈ ఆవిష్కరణ తర్వాత శస్త్రచికిత్సలు సురక్షితంగా మారాయి.

 

గుండె మార్పిడి నుంచి సంక్లిష్టమైన మెదడు ఆపరేషన్ల వరకు నేడు సాధ్యమవుతున్నాయంటే దానికి కారణం ఆనాడు ఈథర్ ప్రయోగంతో పడిన పునాదే..! వైద్యరంగంలో ఈ అద్భుత ఘట్టానికి గుర్తుగా అమెరికాలో ఏటా మార్చి 30ని 'జాతీయ వైద్యుల దినోత్సవం'గా జరుపుకుంటారు. భయంకరమైన నొప్పి నుంచి కోట్లాది మందికి విముక్తి కల్పించిన ఆ ఆవిష్కర్తల కృషిని స్మరించుకుంటారు.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : anesthesia anesthesialogist surgery anesthesia-types local-anesthesia regional-anesthesia general-anesthesia
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com