Summer care : ఎండలో తల తిరుగుతోందా..? ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు .. ఎందుకంటే..? 

సాక్షి లైఫ్ : వేసవి భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఈ సమయంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడమే కాకుండా, రక్తపోటులో మార్పులు వచ్చి అకస్మాత్తుగా తల తిరగడం, కళ్లు బైర్లు కమ్మడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి సమయంలో కంగారు పడకుండా తక్షణమే స్పందించడం అవసరం. ఆ చిట్కాలేంటో చూద్దాం..

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

 

1. వెనువెంటనే నీడలోకి..

ఎండలో ఉన్నప్పుడు తల తిరిగినట్లు అనిపిస్తే, మొట్టమొదట చేయవలసిన పని నీడ పట్టుకు చేరడం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా చల్లని గాలి తగిలే ప్రదేశంలో లేదా ఏసీ గదిలో కూర్చోవాలి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది.

2. పాదాలను పైకి ఉంచండి..

నీడలోకి వెళ్ళాక నేరుగా పడుకుని, పాదాల కింద దిండు లేదా ఏదైనా ఎత్తైన వస్తువును ఉంచి కాళ్ళను పైకి ఎత్తాలి. ఇలా చేయడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడి, తల తిరగడం త్వరగా తగ్గుతుంది.

3. ద్రవ పదార్థాలు..

శరీరం డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోతాయి.
వెంటనే ఒక గ్లాసు మంచినీళ్లు, కొబ్బరి నీళ్లు లేదా ఓఆర్ఎస్ (ORS) కలిపిన నీటిని తాగాలి. నిమ్మరసం.. గ్లాసు నీటిలో కొద్దిగా ఉప్పు, పంచదార కలిపిన నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

4. శ్వాసపై ధ్యాస..

కళ్లు తిరుగుతున్నప్పుడు ఆందోళన చెందడం వల్ల శ్వాస వేగం పెరుగుతుంది. ఇది పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తుంది. కాబట్టి, కళ్లు మూసుకుని ప్రశాంతంగా, నెమ్మదిగా గాలి పీల్చుకోవాలి. తద్వారా మెదడుకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా అందుతుంది.

జాగ్రత్త పడాల్సిన సంకేతాలు..

తీవ్రమైన తలనొప్పి వస్తున్నా..

చూపు మసకబారుతున్నా..

వికారం లేదా వాంతులు అవుతున్నా..

శరీరం స్పర్శ కోల్పోతున్నట్లు అనిపించినా..
వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
 
వేసవిలో ఖాళీ కడుపుతో ఎండలోకి వెళ్లవద్దు. శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గడం వల్ల కూడా తల తిరగవచ్చు. వెంట ఎప్పుడూ కొన్ని పండ్లు లేదా గ్లూకోజ్ ప్యాకెట్ ఉంచుకోవడం మంచిది.

 

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : summer-health-tips summer-season summer summer-health summer-tips summer-alert summer-heat
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com