Health Risks and Diseases : పాత దిండ్లు వాడుతున్నారా..? ఈ వ్యాధుల ముప్పు తప్పదు జాగ్రత్త.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రోజంతా కష్టపడి ఇంటికి చేరిన తర్వాత హాయిగా నిద్రపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ మీరు తల కింద పెట్టుకునే 'దిండు' పాతదైతే.. అది హాయిని ఇవ్వకపోగా అనారోగ్యాన్ని పంచుతుందని మీకు తెలుసా..? చాలామంది ఏళ్ల తరబడి ఒకే దిండును వాడుతుంటారు. అది మెడ నొప్పి, అలర్జీలు, నిద్రలేమి వంటి సమస్యలకు కారణమవుతోందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ దిండును ఎప్పుడు మార్చాలి..? ఎందుకు మార్చాలి..? అనే అంశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 

వ్యాధుల పుట్ట.. పాత దిండు..!

దిండు కేవలం తల కింద పెట్టుకునే వస్తువు మాత్రమే కాదు, అది మన వెన్నెముక భంగిమను (Posture) నియంత్రించే కీలక సాధనం. దిండు ఆకారం కోల్పోతే మెడ, తలకు సరైన మద్దతు లభించదు. దీనివల్ల ఉదయం లేవగానే తలనొప్పి, మెడ పట్టేయడం లేదా తీవ్రమైన అలసట వేధిస్తాయి.

 మనం దిండును రెగ్యులర్‌గా ఉతికినా.. కాలక్రమేణా దాని పొరల్లో దుమ్ము, చనిపోయిన చర్మ కణాలు, చెమట పేరుకుపోతాయి. ఇవి కళ్లలో దురద, ఆస్తమా, ఛాతీలో బిగుతు వంటి శ్వాసకోశ సమస్యలకు దారితీస్తాయి. సరైన దిండు లేకపోతే రాత్రంతా పక్కలు మారుస్తూ ఉండాల్సి వస్తుంది. ఫలితంగా గాఢ నిద్ర కరువై, మరుసటి రోజు పనిపై ప్రభావం పడుతుంది.

ఎప్పుడు మార్చాలి అంటే..?

దిండు తయారీకి వాడిన మెటీరియల్‌ను బట్టి దాని జీవితకాలం మారుతుంటుంది. సాధారణంగా ప్రతి 2 నుంచి 3 ఏళ్లకు ఒకసారి దిండును మార్చడం మంచిది. పాలిస్టర్, ఫైబర్.. వంటివి త్వరగా మెత్తబడిపోతాయి. కాబట్టి వీటిని ప్రతి 12 నుంచి 18 నెలలకు ఒకసారి మార్చడం ఆరోగ్యకరం. మెమరీ ఫోమ్..ఇవి ఆకారాన్ని ఎక్కువ కాలం నిలుపుకుంటాయి. వీటిని 3 నుంచి 4 ఏళ్ల వరకు వాడుకోవచ్చు. లేటెక్స్ పిల్లోస్.. ఇవి అత్యంత మన్నికైనవి. 4 ఏళ్ల తర్వాత కూడా ఇవి చెక్కుచెదరవు.

సంరక్షణ ఇలా..

దిండును కేవలం మార్చడమే కాదు, వాడే సమయంలోనూ జాగ్రత్తలు అవసరం.  సాధారణ దిండ్లను ప్రతి 3 నుంచి 6 నెలలకు ఒకసారి ఉతకాలి. ఉతికే ముందు లేబుల్‌పై ఉన్న సూచనలను తప్పనిసరిగా చదవాలి. మెమరీ ఫోమ్ లేదా లేటెక్స్ దిండ్లను నీళ్లలో ఉతకకూడదు. వాటిపై ఏవైనా మరకలు పడితే తడి గుడ్డతో తుడిచి శుభ్రం చేసుకోవాలి. మీ దిండును మధ్యలోకి మడవండి. అది వెంటనే తన పాత ఆకారానికి రాకపోతే, దాని మన్నిక అయిపోయిందని అర్థం. వెంటనే కొత్త దిండును కొనుగోలు చేయడం మీ ఆరోగ్యానికి మంచిది..!

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.