Healthy habit : రోజుకు ఎన్నిసార్లు మలవిసర్జన చేస్తే ఆరోగ్యంగా ఉన్నట్లు..? నిపుణులు ఏం చెబుతున్నారు..?

షేర్ చేయండి:
Healthy habit : రోజుకు ఎన్నిసార్లు మలవిసర్జన చేస్తే ఆరోగ్యంగా ఉన్నట్లు..? నిపుణులు ఏం చెబుతున్నారు..?

సాక్షి లైఫ్ : మన జీర్ణక్రియ (Digestion) ఎలా ఉందో చెప్పడానికి మలవిసర్జన ప్రక్రియ ఒక ముఖ్యమైన సూచిక. అయితే, చాలా మందిలో ఒక సాధారణ సందేహం ఉంటుంది.. "రోజుకు ఎన్నిసార్లు విసర్జన సాగితే దానిని సాధారణం లేదా ఆరోగ్యం అనుకోవాలి?". కొంతమంది రోజుకు రెండు మూడు సార్లు వెళ్తుంటారు, మరికొందరు రోజు విడిచి రోజు వెళ్తుంటారు. ఇందులో ఏది సరైనదో, వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి.. శరీరంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ ఎంత ఉండాలి..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

 

ఏది ఆరోగ్యకరం..?

వైద్యశాస్త్రం ప్రకారం, మలవిసర్జనకు సంబంధించి అందరికీ ఒకే రకమైన నియమం వర్తించదు. ఒక్కొక్కరి శరీర తత్వం, జీవనశైలిని బట్టి ఇది మారుతూ ఉంటుంది. 'త్రీ బై త్రీ' (3x3) రూల్.. గ్యాస్ట్రోఎంటరాలజిస్టుల ప్రకారం.. రోజుకు గరిష్టంగా మూడు సార్లు నుండి, వారానికి కనిష్టంగా మూడు సార్లు మలవిసర్జన జరగడాన్ని ఆరోగ్యకరమైనదిగా భావిస్తారు. ఎలాంటి నొప్పి, ఇబ్బంది లేదా రక్తం పడటం వంటి సమస్యలు లేనంత వరకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

సమస్య ఎప్పుడు వస్తుంది..?

రోజుకు మూడు సార్ల కంటే ఎక్కువసార్లు వెళ్లాల్సి రావడం, విరేచనాలు (Diarrhea) అవ్వడం.. లేదా వారానికి మూడు సార్ల కంటే తక్కువగా వెళ్తూ, మలం గట్టిగా మారి తీవ్రంగా ముక్కాల్సి రావడం (మలబద్ధకం/Constipation) జరిగితే దానిని అనారోగ్య లక్షణంగా గుర్తించాలి.

మలవిసర్జనని ప్రభావితం చేసే అంశాలు..

ఆహారంలో పీచుపదార్థం (Fiber)..

 మనం తినే ఆహారంలో పీచు (ఫైబర్) ఎక్కువగా ఉంటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినేవారిలో విసర్జన క్రమబద్ధంగా ఉంటుంది.

తాగే నీటి పరిమాణం..

శరీరంలో తగినంత నీరు లేకపోతే (Dehydration), ప్రేగులలోని వ్యర్థాలు గట్టిగా మారి మలబద్ధకానికి దారితీస్తుంది. కాబట్టి రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగడం ముఖ్యం.

శారీరక శ్రమ..

 వ్యాయామం లేదా నడక వంటి శారీరక శ్రమలు ప్రేగుల కదలికలను (Bowel Movements) చురుగ్గా ఉంచుతాయి. రోజంతా ఒకేచోట కూర్చుని ఉండేవారిలో జీర్ణవ్యవస్థ మందగిస్తుంది.

మానసిక ఒత్తిడి..

మన మెదడుకు, జీర్ణవ్యవస్థకు దగ్గరి సంబంధం ఉంటుంది. అధిక ఒత్తిడి, ఆందోళన (Stress) వల్ల కొందరిలో మలబద్ధకం లేదా మరికొందరిలో ఐబీఎస్ (IBS - Irritable Bowel Syndrome) కారణంగా తరచూ విసర్జనకు వెళ్లాల్సి రావడం జరుగుతుంది.

వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి..?

మీ అలవాట్లలో అకస్మాత్తుగా మార్పులు వస్తే గమనించాలి. ముఖ్యంగా మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి రావడం. మలంలో రక్తం పడటం లేదా నల్లగా రావడం, ఎలాంటి కారణం లేకుండానే బరువు తగ్గిపోవడం, వారం దాటినా విసర్జన కాకపోవడం లేదా నిరంతరం విరేచనాలు అవ్వడం,ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం ఉత్తమం.

  ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

  ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.