యోగా ద్వారా శరీరాన్ని ఎలా డిటాక్స్ చేయవచ్చు..? 

సాక్షి లైఫ్ : వైద్యనిపుణులు ఎప్పటికప్పుడు శరీరాన్ని నిర్విషీకరణ చేయాలని చెబుతున్నారు, ఇలా చేయడం వల్ల అనేక వ్యాధుల బారి నుంచి బయటపడొచ్చని వారు వెల్లడిస్తున్నారు. శరీరాన్ని నిర్విషీకరణ చేసే ఇలాంటి ఎన్నో విషయాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంటాయి. మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఎంత ఆరోగ్యకరమైనవి అనే దానితో సంబంధం లేకుండా యోగా ద్వారా శరీరాన్ని నిర్విషీకరణ చేయవచ్చని మీకు తెలుసా..? మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వాతావరణంలో మార్పుల వల్ల శరీరం ప్రభావితమవుతుంది. అటువంటి సమయంలో శరీరాన్ని నిర్విషీకరణ చేయడం చాలా అవసరం.

 ఇది కూడా చదవండి.. పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ డిసీజ్ లక్షణాలు ఎలా వుంటాయి..?

ఇది కూడా చదవండి.. వరల్డ్ సికిల్ సెల్ డే చరిత్ర, ప్రాముఖ్యత..?  

ఈ రోజుల్లో బాడీ డిటాక్స్ పేరుతో రకరకాల డ్రింక్స్ తాగడం మీరు చూసి ఉంటారు. శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి శరీరాన్ని నిర్విషీకరణ చేయడం చాలా ముఖ్యం అని వైద్యనిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి, శరీర నిర్విషీకరణలో శరీరం నుంచి విష పదార్థాలను తొలగించడం,బరువు తగ్గడం వంటివి ఉంటాయి.


 డిటాక్స్..? 

 శరీరం నిర్విషీకరణ అవసరం ఎప్పుడు అనేది సూచించడానికి మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే..? 

చర్మ సమస్య
కడుపు ఉబ్బరం
కొన్నిశరీర అవయవాల వాపు
బరువు పెరగడం 
 అలసట 

శరీరం రోగాల బారిన పడకుండా.. 

యోగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిరంతరం యోగా చేయడం వల్ల శరీరం రోగాల బారిన పడకుండా ఉంటుంది. అయితే యోగా ద్వారా మన శరీరాన్ని నిజంగా నిర్విషీకరణ చేయవచ్చా లేదా? యోగా జర్నల్‌లోని ఒక నివేదిక ప్రకారం, యోగా శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుందనడానికి ప్రత్యక్ష సమాధానం లేదు. అయితే, కొంతమంది నిపుణులు యోగాకు సంబంధించిన కొన్ని భంగిమలను సూచిస్తారు. ఇవి  ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు.

 లివర్ డిటాక్సిఫికేషన్..  

చర్మం, మూత్రపిండాలు,ప్రేగుల వలె, మన కాలేయం కూడా శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మన శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది. అయితే, కాలేయం ఆరోగ్యంగా ఉంటే శరీరంలో డిటాక్స్ ఫికేషన్ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. అయితే, మన శరీరం సరిగ్గా పనిచేయాలంటే మనం శారీరకంగా చురుకుగా ఉండాలి. ఇతర వ్యాయామాల మాదిరిగానే, యోగా కూడా శరీర విధులను నిర్వహించడంలో సహాయపడుతుంది. మీరు మీ జీవనశైలిలో భుజంగాసన, కపాలభాతి, సలాంబ సర్వంగాసన, బుటి యోగా, పశ్చిమోత్తనాసన వంటి యోగా వంటివి చేయడం వల్ల శరీరంలోని అన్ని విధులు సక్రమంగా కొనసాగుతాయని యోగా నిపుణులు వెల్లడిస్తున్నారు.

 ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

 ఇది కూడా చదవండి.. గోరువెచ్చని నీళ్లు తాగితే వెయిట్ లాస్ అవుతారా..? నిజమేనా..?  

 ఇది కూడా చదవండి.. అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి

Tags : mental-health mental-tensions dental-problems healthy-habits healthy-habit food-habits human-body bad-habit detoxification-of-the-body yoga yoga-practice hot-yoga-benefits yoga-benefits yoga-health-benefits yogasanas body-detox detoxify detoxification yoga-cleansing-practices

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com