Boost Digestion : ఆరోగ్యానికి ఫార్ములా '30/30/3' ..జీర్ణక్రియకు శక్తికి తిరుగుండదు..!

సాక్షి లైఫ్ : ప్రస్తుత యాంత్రిక జీవనంలో సరైన ఆహారపు అలవాట్లు లేక చాలామంది జీర్ణక్రియ సమస్యలు, అధిక బరువు, నీరసంతో సతమతమవుతున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టి, శరీరాన్ని దృఢంగా ఉంచేందుకు పోషకాహార నిపుణులు '30/30/3' అనే వినూత్న నియమాన్ని సూచిస్తున్నారు. ఎటువంటి కఠినమైన డైటింగ్ అవసరం లేకుండానే, కేవలం ఉదయం వేళ చేసే చిన్న మార్పులతో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని వారు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?

 

ఏమిటి 30/30/3 ఫార్ములా..?

ఈ ఫార్ములా ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీ రోజువారీ దినచర్యలో వీటిని భాగం చేసుకోవడం ద్వారా జీవక్రియ (Metabolism) వేగవంతమవుతుంది.

1. నిద్రలేచిన 30 నిమిషాల్లో.. 30 గ్రాముల ప్రోటీన్..

మనం చేసే అతిపెద్ద తప్పు అల్పాహారాన్ని ఆలస్యంగా తీసుకోవడం లేదా మానేయడం. ఈ నియమం ప్రకారం, నిద్రలేచిన అరగంట లోపు కనీసం 30 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. గుడ్లు, పన్నీర్, పెరుగు, పప్పు ధాన్యాలు లేదా ప్రోటీన్ షేక్ వంటివి ఎంచుకోవచ్చు. ఇది శరీరంలో కేలరీలను కరిగించే వేగాన్ని పెంచుతుంది.

2. రోజుకు 30 గ్రాముల పీచు పదార్థం (Fiber)..

జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడాలంటే ఫైబర్ అత్యవసరం. రోజువారీ ఆహారంలో 30 గ్రాముల పీచు పదార్థం ఉండేలా చూసుకోవాలి. చియా గింజలు, చిక్కుళ్లు, తాజా ఆకుకూరలు, బెర్రీ పండ్లు. ఇవి పేగుల ఆరోగ్యాన్ని కాపాడి, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తాయి.

3. మూడు రకాల ప్రోబయోటిక్ ఆహారాలు..

మన పొట్టలో ఉండే మేలు చేసే బ్యాక్టీరియా (Microbiota) వృద్ధికి ప్రోబయోటిక్స్ కీలకం. రోజుకు మూడు రకాల ప్రోబయోటిక్ ఆహారాలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఇది మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా, శరీరంలో వాపు (Inflammation)ను తగ్గిస్తుంది.

కలిగే ప్రయోజనాలు..?

బరువు నియంత్రణ: ఉదయాన్నే ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీనివల్ల అతిగా తినడం తగ్గి, బరువు అదుపులోకి వస్తుంది. రోజంతా నీరసం దరిచేరకుండా శక్తివంతంగా ఉండేలా ఈ నియమం దోహదపడుతుంది.

పీచు పదార్థం అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులు తొలగిపోయి జీర్ణవ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. "30/30/3 నియమం అనేది కేవలం ఆహార ప్రణాళిక మాత్రమే కాదు, అదొక ఆరోగ్యకరమైన ప్రారంభం. ఇది మీ జీవనశైలిని క్రమబద్ధీకరించి, దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును తగ్గిస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు.  ఖరీదైన జిమ్ లో ట్రైనింగ్ , సంక్లిష్టమైన డైట్ ప్లాన్ల కంటే.. ఇంటి వద్దే పాటించగలిగే ఈ సులభమైన సూత్రం మీ ఆరోగ్యాన్ని మారుస్తుందని నిపుణులు భరోసా ఇస్తున్నారు. 

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..  

ఇది కూడా చదవండి..New Guidelines : శరీరానికి అవసరమయ్యే నీటి పరిమాణంలో కొత్త మార్గదర్శకాలు..

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : energy-drink digestion energy metabolism digestion-problems energy-boost
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com