ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలాంటి ఆహారాల నుంచి పొందవచ్చు..? 

సాక్షి లైఫ్ : కొన్నిరకాల పోషకాలు పలురకాల ఆహారపదార్థాలలో మాత్రమే లభిస్తాయి. అటువంటప్పుడు ఏ పోషకాలు లోపించాయో తెలుసుకొని వాటిని సంబంధిత ఫుడ్ తీసుకోవడం ద్వారా పోషకాహారలోపం తలెత్తకుండా జాగ్రత్తపడొచ్చు. అదేవిధంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపిస్తే కొన్నిరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకోసమే దీనిని నివారించడానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా లభించే ఆహారపదార్థాలను తీసుకోవడం చాలా అవసరం.. అవేంటంటే..?   
 

ఇది కూడా చదవండి..జుట్టు, చర్మ సంరక్షణకు విటమిన్ "ఇ" చేసే మేలు తెలుసా..?

ఇది కూడా చదవండి..ప్రోటీన్ ఫుడ్ దేనికి ప్రయోజనకరం..?

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?

 సోయాబీన్.. 

సోయాబీన్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. మీరు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాన్ని తినాలనుకుంటే, మీరు మీ ఆహారంలో సోయాబీన్‌ను చేర్చుకోవచ్చు.

గుడ్డులో ఒమేగా-3.. 

అందరూ గుడ్లు తినడానికి ఇష్టపడతారు. మాంసాహారం తీసుకోని వారు కూడా గుడ్లు తినడానికి ఇష్టపడతారు. గుడ్డు శరీరానికి శక్తిని అందిస్తుంది. అంతేకాదు ఇది శరీరంలోని పోషకాల లోపాన్ని కూడా తీరుస్తుంది. గుడ్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తగిన మోతాదులో ఉంటాయి.

 వాల్‌నట్స్.. 

వాల్ నట్స్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది, మీరు దీన్ని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం లేదా రాత్రి కూడా తినవచ్చు. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అంతేకాదు మెదడు వ్యాధులను కూడా నయం చేస్తాయి.

  అవిసె గింజలు..  

శరీరంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల లోపాన్ని అవిసె గింజలతో భర్తీ చేయవచ్చు. మీరు ఈ గింజలను పాలతో తినవచ్చు.

చియా గింజలు..  

మీరు చియా విత్తనాలను పొడిగా తయారు చేసి, దానిని ప్రోటీన్ షేక్‌గా తీసుకోవచ్చు. ఇది రోజంతా మీకు శక్తిని ఇస్తుంది. శరీరానికి కొవ్వు ఆమ్లాలను కూడా అందిస్తుంది.

ఇది కూడా చదవండి..హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీ (హెచ్ఆర్టి) అంటే ఏమిటి..? మెనూపాజ్ విషయంలో ఇది ఎలా పని చేస్తుంది?

ఇది కూడా చదవండి..మందులతో పనిలేకుండా అధికరక్తపోటు ఎలా తగ్గుతుంది..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : women-health-problems chia-seeds flax-seeds flax-seeds-for-weight-loss omega-3-fatty-acids omega-3-benefits benefits-of-omega-3 omega-3-foods omega-3-supplements
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com