సాక్షి లైఫ్ : మార్నింగ్ వాక్, యోగా, జిమ్.. ఇలా ఫిట్‌నెస్ కోసం అనేక శారీరక శ్రమ పద్ధతులను అనుసరిస్తారు. అయితే వర్కవుట్ తర్వాత ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుందో తెలుసా? అసలు వర్కౌట్ చేసేవాళ్లు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది..? పోస్ట్-వర్కౌట్ ఫుడ్ లో ఏమేం ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి అనేదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కొందరు ఆరోగ్యంగా ఉండడానికి తరచుగా వ్యాయామం, యోగా, ఇతర శారీరక శ్రమలను వారి దినచర్యలో భాగంగా చేసుకుంటారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఈ కార్యకలాపాలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. అయితే జిమ్ లలో చేసిన శ్రమకు ఎక్కువ ప్రయోజనం పొందాలంటే, వ్యాయామం తర్వాత తీసుకునే ఆహారంలోనూ మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు.
ఇది కూడా చదవండి..చలికాలంలో విటమిన్-డి లోపాన్ని ఎలా అధిగమించాలి..?
ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక ఆస్తమా మందుల వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి?
ఇది కూడా చదవండి..బట్టతలకు చికిత్స చేయవచ్చా..?
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత మహిళల్లో వచ్చే వ్యాధులు ఇవే..
ఇది కూడా చదవండి..పోలియో నివారణకు ఏకైక మార్గం ఇదే..
ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?
వ్యాయామం చేసే వాళ్లు తమ రోజును ఆరోగ్యకరమైన అల్పాహారంతో ప్రారంభిస్తారు. కానీ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే పోస్ట్-వర్కౌట్ డైట్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాయామం చేసేటప్పుడు శరీరంలోని శక్తి చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి ఆయా లోపాన్ని భర్తీ చేయడం చాలా ముఖ్యం. వ్యాయామం తర్వాత తినడం వల్ల శరీరానికి అవసరమైన అనేక పోషకాలు అందుతాయి. ఇవి కండరాల అభివృద్ధికి సహాయపడతాయి. అంతే కాకుండా శరీరానికి శక్తినిచ్చి అలసటను తగ్గిస్తుంది.
వోల్ గ్రెయిన్ బ్రెడ్(ధాన్యపు రొట్టె), పప్పు ధాన్యాలు..
వ్యాయామం తర్వాత ధాన్యపు రొట్టెతో పప్పులు తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలకు మంచి మూలం. ఈ రకమైన రోటీలలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీనితో పాటు శనగలు, మినుములు,పెసరపప్పు వంటి పప్పుధాన్యాల్లో ప్రొటీన్లు, మినరల్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతాయి.
డ్రై ఫ్రూట్స్..
జీడిపప్పు, బాదం, వాల్‌నట్‌లు వంటి డ్రై ఫ్రూట్స్‌ను వ్యాయామం చేసిన తర్వాత తీసుకోవడం వల్ల కండరాలు గట్టిపడడంతోపాటు శక్తి పెరుగుతుంది. కాల్షియం, విటమిన్లు, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫ్లేవనాయిడ్స్ డ్రై ఫ్రూట్స్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కాబట్టి జిమ్ తర్వాత వీటిని తినవచ్చు.
ఓట్స్..
ఓట్స్ శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లకు ఇవి అద్భుతమైన ఎంపిక. వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభించడమేకాకుండా ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని అందిస్తుంది. అందువల్ల, మీరు వ్యాయామం చేసిన తర్వాత తినవచ్చు.
విత్తనాలు..
అవిసె గింజలు, గుమ్మడి గింజలు, నువ్వులు, చియా గింజలలో తగినంత మొత్తంలో ప్రోటీన్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కనిపిస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి తగిన పోషకాహారం అందడంతో పాటు శరీరం ఫిట్‌గా, ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేలా చేస్తుంది.
మొలకలు..
వ్యాయామం తర్వాత కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉండే శనగలు తీసుకోవడం వల్ల కండరాలు దృఢంగా ఉంటాయి. రోజంతా శక్తిని అందిస్తాయి. అదే మొలకెత్తిన శనగలు అయితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి..డిసీజ్ ఎక్స్ కరోనా కంటే తీవ్రమైందా..?
ఇది కూడా చదవండి..యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే ఏమిటి...?
ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com