వృద్ధులలో ఎముకలు ఎందుకు తొందరగా విరుగుతాయి..? 

సాక్షి లైఫ్ : ఎముకలు శరీర బరువుకు మద్దతు ఇచ్చే బలమైన స్తంభాల లాంటివి. వృద్ధులలో కాలక్రమేణా ఎముకల బలహీనత ఎలా పెరుగుతుందో పడిపోయిన తర్వాత వారి ఎముకలు ఎందుకు తీవ్రంగా గాయపడతాయి..? ఎలాంటి వారిలో ఎముకలు తొందరగా విరుగుతాయి..? అందుకు ప్రధాన కారణాలు ఏంటీ అనేది ఆగస్టు 4న (అంటే ఈరోజు) జాతీయ ఎముకలు, కీళ్ల దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..ఔషధాలతో పని లేకుండా చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించవచ్చా..?

ఇది కూడా చదవండి..ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

 నేషనల్ బోన్ అండ్ జాయింట్ డే 2024.. 

వృద్ధాప్యం అనేది శరీరం బయట, లోపల బలహీనంగా మారే సమయం. ఈ కాలంలో బలహీనతతోపాటు ఆరోగ్య సంబంధిత సమస్యలు పెరుగుతాయి. 

వృద్ధులలో గాయాలకు ప్రధాన కారణం..? 

 వెన్నెముక, తుంటి, మణికట్టు, చేయి, కాలు, పెల్విస్  పగుళ్లు, బోలు ఎముకల వ్యాధి, వయస్సు పైబడడం వల్ల పలురకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.  

భారతదేశంలో వృద్ధులలో మరణాలు, వైకల్యానికి ప్రధాన కారణాలలో ఎకుమలకు గాయాలు అవ్వడం ఒకటి. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో సుమారు 50శాతంమంది పైగా ఎముకల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వృద్ధులలో, కండరాల బలహీనత, బలహీనమైన దృష్టి,  ఔషధాల అధిక మోతాదు, విటమిన్ లోపాల వల్ల ఎముకల గాయాలు సంభవించవచ్చు.

వృద్ధులలో పతనం-సంబంధిత గాయాలు:
 
వృద్ధులలో దాదాపు 20శాతం మందిలో వెన్నెముక, తుంటి, మణికట్టు, చేయి, కాలుకు గణనీయమైన గాయాలు కలిగిస్తుంది. తలకు గాయాలు కావడానికి నీళ్లల్లో జారి పాడడమే ప్రధాన కారణమని కూడా అంచనా వేస్తున్నారు పరిశోధకులు. కింద పాడినప్పుడు ఫ్రాక్చర్ తీవ్రంగా ఉంటుంది. అప్పుడు  శస్త్రచికిత్స అవసరమవుతుంది. సకాలంలో చికిత్స చేయకపోతే, జీవన నాణ్యత గణనీయంగా క్షీణిస్తుంది.


వృద్ధులలో పడిపోయే సంభావ్య ప్రమాదాలు:

• నాడీ వ్యవస్థలో వయస్సు-సంబంధిత మార్పులు, దృష్టి కోల్పోవడం, వణుకు, నడక, పడిపోయే ప్రమాదాన్ని పెంచుతాయి.

• మితిమీరిన మందులు, జారే ఉపరితలాలు, నాణ్యత లేని షూ, అరికాళ్ళు కూడా పడిపోవడానికి  కారణమవుతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు

• ఎముకల సాంద్రత, దృష్టి, సమతుల్యత, కండరాల బలం, స్థిరత్వం క్షీణించడం వల్ల వృద్ధులు పడిపోవడం ద్వారా గాయాలకు గురయ్యే అవకాశం ఉంది.

• హిప్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి, ఇతర మస్క్యులోస్కెలెటల్ సమస్యలు వంటి పరిస్థితులు వృద్ధులలో పడిపోయే ప్రమాదాన్ని పెంచుతాయి.

ఇది కూడా చదవండి..పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసా..?

ఇది కూడా చదవండి..వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : bone-health weak-bones strong-bones healthy-bones hip-joint-problems joint-replacement national-bone-and-joint-day-2024 bone-and-joint-health nutritious-diet-for-bone-and-joint-health center-for-bone-and-joint-health healthy-weight-for-bone-and-joint-health bone-and-joint-supplement bmi-and-joint-health tobacco-use-and-joint-health importance-of-check-ups-for-bone-and-joint-health national-bone-and-joint-day national-bone-and-joint-day2024 joint-pain joint-health national-bone-and-joint-health

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com