Vitamin D vs Vitamin E : ఇమ్మ్యూనిటీకి విటమిన్ 'డి' Vs విటమిన్'ఇ'లలో ఏది బెటర్..?
సాక్షి లైఫ్ : ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల నేడు చాలామంది నీరసం, అప్పుడుడప్పుడు ఇన్ఫెక్షన్ల బారిన పడటం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఇలాంటి సమయంలో రోగనిరోధక శక్తిని (Immunity), శక్తిని (Energy) పెంచుకోవడానికి విటమిన్ "డి", విటమిన్ "ఇ" రెండూ కీలకమే.
అయితే, ఈ రెండిటిలో ఏది ఎక్కువ ప్రభావవంతమైనది..? దేని ప్రత్యేకత ఏమిటి..? తాజా పరిశోధనల ఆధారంగా వైద్యనిపుణులు ఏం చెబుతున్నారు..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
రోగనిరోధక వ్యవస్థను పెంపొందించడంలో విటమిన్ "డి" కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. మన శరీరంలోని రోగనిరోధక కణాలు (T-cells, Macrophages) బ్యాక్టీరియా, వైరస్‌లను గుర్తించి చంపడానికి విటమిన్ "డి" ఇంధనంలా పనిచేస్తుంది. శరీరంలో విటమిన్ "డి" లోపిస్తే విపరీతమైన నీరసం (Fatigue) ఆవహిస్తుంది. "డి" విటమిన్ లోపాన్ని అధిగమించడం ద్వారా నిద్రలేమి సమస్య తగ్గి, ఉత్సాహంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. సూర్యరశ్మి "డి" విటమిన్ కు ప్రధాన వనరు. చేపలు, గుడ్డు సొన, పాలు, తృణధాన్యాల ద్వారా కూడా ఇది లభిస్తుంది.
విటమిన్ "ఇ"..
శరీరంలోని కణాల రక్షణ కవచంలా పనిచేస్తుంది విటమిన్ "ఇ". ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ముఖ్యంగా శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలు దెబ్బతినకుండా ఇది రక్షిస్తుంది. అంతేకాదు పరోక్షంగా రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
చర్మం, కళ్ళు.. చర్మ సౌందర్యానికి, కంటి ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. కణాల పునరుత్పత్తిలో దీని పాత్ర కీలకం. బాదం, వేరుశనగలు, పొద్దుతిరుగుడు గింజలు, బచ్చలికూర, వెజిటబుల్ ఆయిల్స్‌లో ఇది పుష్కలంగా లభిస్తుంది.
ఏది ఎప్పుడు ముఖ్యం అంటే..?
| విటమిన్ "డి" | విటమిన్ "ఇ" | |
| ప్రధాన పాత్ర | ఎముకలు, నేరుగా రోగనిరోధక శక్తి | యాంటీ ఆక్సిడెంట్, కణాల రక్షణ |
| శక్తి (Energy) | లోపం ఉంటే నీరసం వస్తుంది | తక్షణ శక్తిపై తక్కువ ప్రభావం |
| వ్యాధుల నివారణ | జలుబు, ఫ్లూ, ఆటో ఇమ్యూన్ సమస్యలు | గుండె జబ్బులు, చర్మ సమస్యలు |
| సప్లిమెంట్లు | చాలా మందికి అవసరమవుతాయి | ఆహారం ద్వారా సరిపోతుంది |
విటమిన్ "డి" పాత్ర..
అప్పడప్పుడు అనారోగ్యానికి గురవుతూ, తీవ్రమైన నీరసంతో బాధపడుతుంటే విటమిన్ "డి" పాత్ర అప్పుడు తక్కువగా ఉన్నట్లు భావించాలి. అయితే, శరీరాన్ని లోపలి నుంచి శుద్ధి చేసి, కణాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి విటమిన్ "ఇ" తప్పనిసరి. విటమిన్ "ఇ" సాధారణంగా మనం తినే ఆహారం ద్వారా అందుతుంది, కానీ విటమిన్ "డి" కోసం మాత్రం ఎండలో ఉండటం లేదా వైద్యుల సలహాతో సప్లిమెంట్లు తీసుకోవడం అవసరమని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..Vitamin D Superfoods : విటమిన్ డి సూపర్ ఫుడ్స్: ఈ నాలుగు ఫుడ్స్ తీసుకుంటే సరిపోతుంది..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
