For Weight Loss : వెయిట్ లాస్ కు శారీరక శ్రమ ఒక్కటే చాలదు.. ఫుడ్ హ్యాబిట్స్ మార్చాల్సిందే : శాస్త్రవేత్తలు

సాక్షి లైఫ్ : మనం ఎంత కష్టపడి వ్యాయామం చేసినా, మన శరీరం ఖర్చు చేసే మొత్తం శక్తిలో వ్యాయామం ద్వారా ఖర్చయ్యేది చాలా తక్కువ. శాస్త్రవేత్తలు దీనిని 'కన్‌స్ట్రెయిన్డ్ ఎనర్జీ ఎక్స్‌పెండిచర్' (Constrained Energy Expenditure) మోడల్‌గా పిలుస్తున్నారు. ఎందుకు వ్యాయామం మాత్రమే సరిపోదు? మీరు వ్యాయామం ద్వారా 500 కేలరీలు ఖర్చు చేసినప్పుడు, మన శరీరం ఇతర పనులకు ఉదాహరణకు కణాల మరమ్మతు, రోగనిరోధక శక్తి వాడే శక్తిని తగ్గించుకుంటుంది. 

 

ఇది కూడా చదవండి..Weight Loss Pills : అధిక బరువును తగ్గించే మాత్రలు.. వచ్చేస్తున్నాయ్..!

ఇది కూడా చదవండి..Is It Safe to Use the Same Shampoo : ఒకే బ్రాండ్‌ షాంపూ ఎక్కువ కాలం వాడకూడదా..?

ఇది కూడా చదవండి..AI Detects a Life-Threatening Tumor : వైద్యులు గుర్తించలేకపోయినా ప్రాణాంతకమైన ట్యూమర్ ఉన్నట్లు కనుగొన్న ఏఐ..

 

బూడిదలో పోసిన పన్నీరులా..

ఫలితంగా రోజు మొత్తం మీద ఖర్చయ్యే కేలరీల సంఖ్య పెద్దగా మారదు. తీవ్రమైన వ్యాయామం తర్వాత ఆకలి హార్మోన్లు (Ghrelin) విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల మనకు తెలియకుండానే ఎక్కువ ఆహారం తీసేసుకుంటాం. 'ఒక గంట పరుగెత్తానుకదా.. ఒక బర్గర్ తింటే ఏమవుతుందిలే' అన్న చిన్న ఆలోచన మీరు చేసిన మీ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరులా చేస్తుంది.

ఒక గంట నడిస్తే కరిగేది 200-300 కేలరీలే. కానీ మనం తాగే ఒక కూల్ డ్రింక్ లేదా తినే చిన్న స్వీట్ ద్వారా అంతకంటే ఎక్కువ కేలరీలు శరీరంలోకి చేరిపోతాయి. 

బరువు తగ్గాలంటే మార్చాల్సింది ఇదే..!

నిజమైన మార్పు రావాల్సింది వ్యాయామంలో కాదు, మీ ప్లేటులో..! బరువు తగ్గడానికి 'కేలరీ డెఫిసిట్' (Calorie Deficit) అంటే.. తీసుకునే ఆహారం కంటే ఖర్చు చేసే శక్తి ఎక్కువగా ఉండటం ముఖ్యమని పరిశోధకులు అంటున్నారు. ఆహారమే కీలకం 70శాతం చక్కెర, పాలిష్ పట్టిన బియ్యం తగ్గించి.. ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. వ్యాయామం తోడు 30శాతం కేవలం బరువు తగ్గడానికే కాకుండా.. గుండె ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం వ్యాయామం చేయాలి.

రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి..

తక్కువ నిద్ర, అధిక ఒత్తిడి వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి. మీరు ఎంత వేగంగా పరుగెత్తినా, చెడు ఆహారపు అలవాట్లను (Bad Diet) దాటి ముందుకు వెళ్లలేరు. బరువు తగ్గడంలో ఆహారం 70 శాతం పాత్ర పోషిస్తుందని, వ్యాయామం కేవలం దానికి మద్దతుగా నిలుస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి, కేవలం జిమ్ మెట్లు ఎక్కితే సరిపోదు.. డైనింగ్ టేబుల్ దగ్గర కూడా క్రమశిక్షణ పాటించాల్సిందేనని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

శారీరక శ్రమ చేయడం తప్పు కాదు, కానీ సరైన దిశలో శ్రమ పడటం ముఖ్యం. మీ ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ, దానికి మితమైన వ్యాయామాన్ని జోడిస్తేనే ఆరోగ్యకరమైన 'వెయిట్ లాస్' సాధ్యమవుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..Longevity Diet : దీర్ఘాయువు పెంచే రహస్యం ఇదే.. 

ఇది కూడా చదవండి..Gut Health Superfoods : మీ గట్ హెల్త్ కు కిచెన్ లో లభించే సూపర్‌ఫుడ్స్ 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..  

Tags : stress stress-food bad-food weight-loss stress-mind weight-lose healthy-habits scientists weight over-weight bad-habit weight-gain
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com