Childbirth in Space : అంతరిక్షంలో ప్రసవం.. సురక్షితమేనా..?

షేర్ చేయండి:
Childbirth in Space : అంతరిక్షంలో ప్రసవం.. సురక్షితమేనా..?

సాక్షి లైఫ్ : మనుషులు విశ్వాంతరాళంలో విస్తరించాలనే ఆలోచనతో ఎప్పటి నుంచో పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అంగారకుడిపై కాలనీలు, చంద్రునిపై నివాసాల గురించి చర్చ జరుగుతోంది. అయితే, అంతరిక్షంలో మానవ మనుగడ సాగాలంటే అక్కడ పునరుత్పత్తి (Reproduction) సాధ్యమేనా? గర్భధారణ, ప్రసవం సురక్షితంగా జరుగుతాయా? అన్న అంశంపై ఇటీవల జరిగిన పరిశోధనలు దిగ్భ్రాంతి కలిగించే విషయాలను వెల్లడించాయి.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Obesity and inflammation : ఒబెసిటీకి ఇన్‌ఫ్లమేషన్‌కు లింక్ ఏమిటి..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

 అంతరిక్షంలో..

'రిప్రొడక్టివ్ బయోమెడిసిన్ ఆన్‌లైన్' జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం.. ప్రస్తుత పరిస్థితుల్లో అంతరిక్షంలో ప్రసవం ఏమాత్రం సురక్షితం కాదు. భూమికి దూరంగా, అనంతవాయువుల మధ్య ఉండే వాతావరణం మానవ పునరుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రధాన అడ్డంకులు ఏంటి..? 

 అంతరిక్షంలో ఉండే శక్తివంతమైన కాస్మిక్ కిరణాలు మన కణాల్లోని DNAను దెబ్బతీస్తాయి. ఇది పురుషుల్లోని శుక్రకణాలను, మహిళల్లోని అండాలను బలహీనపరుస్తుంది. ఫలితంగా పిండం ఎదుగుదల ఆగిపోవడం లేదా జన్యుపరమైన లోపాలు తలెత్తే ప్రమాదం ఉంది.

సూక్ష్మ గురుత్వాకర్షణ (Microgravity)..

భూమిపై ఉండే గురుత్వాకర్షణ శక్తి పిండం అభివృద్ధికి, గర్భాశయంలో శిశువు స్థితికి ఎంతో కీలకం. శూన్యంలో పిండం ఎదుగుదల ఎలా ఉంటుందనే దానిపై జంతువులపై జరిపిన ప్రయోగాలు మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. ఒత్తిడి - రిథమ్.. అంతరిక్ష ప్రయాణాల్లో కలిగే మానసిక ఒత్తిడి, నిద్ర వేళల్లో మార్పులు (Circadian Rhythm) హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి.

పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం..

సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడిపే వ్యోమగాముల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. రేడియేషన్ ప్రభావం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ముప్పు కూడా పొంచి ఉంది. తక్కువ కాలం ప్రయాణించే వారిపై పెద్దగా ప్రభావం ఉండకపోయినప్పటికీ.. అక్కడే నివాసం ఉండాలనుకునే వారికి మాత్రం ఇది పెను సవాలే.


అంతరిక్షంలో మానవ కాలనీలు ఏర్పాటు చేయడం సాంకేతికంగా సాధ్యమే కావొచ్చు. కానీ, ఒక ప్రాణం భూమికి వెలుపల సురక్షితంగా జన్మించగలదా? అన్న ప్రశ్నకు సైన్స్ వద్ద ఇంకా పూర్తిస్థాయి సమాధానం లేదు. దీనిపై మరిన్ని లోతైన పరిశోధనలు జరగాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి..Coconut Water : కొబ్బరి బొండం నీళ్లతో బరువు తగ్గొచ్చా..?

ఇది కూడా చదవండి..Brain health : మీ బ్రెయిన్ కంప్యూటర్ లాగా పనిచేయాలంటే ఈ ఆహారపదార్థాలు తినండి..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.