చికిత్స తీసుకుంటున్న క్యాన్సర్ బాధితుల్లో పోషకాహారలోపం.. 

షేర్ చేయండి:
చికిత్స తీసుకుంటున్న క్యాన్సర్ బాధితుల్లో పోషకాహారలోపం.. 

సాక్షి లైఫ్ : ప్రస్తుతం గుర్తింపు పొందిన క్యాన్సర్ ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటు న్న చిన్నారులు పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారు. పోషకాహార విషయంలో పెట్టుబడి పెంపుదల, పోషకాహార నిపుణులకు ప్రత్యేక శిక్షణ, పీడియాట్రిక్ ఆంకాలజీ కేర్‌లో స్ట్రక్చర్డ్ న్యూట్రిషన్ కేర్ ప్రాసెసెస్ (ఎన్‌సిపి)కు తక్షణ చర్యలు అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి.

 ఇది కూడా చదవండి..ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలాంటి ఆహారాల నుంచి పొందవచ్చు..?

 ఇది కూడా చదవండి..తేనెను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి.. 

 ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

65% మంది పిల్లలు..

క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలలో పోషకాహార లోపం గత 3 సంవత్సరాలుగా నిరంతర సమస్యగా మారింది. పోషకాహార లోపం ఉన్న పిల్లల శాతం 2021-22లో 57%, 2022-23లో 61% ఉండగా 2023-24లో 58%గా ఉంది.క్యాన్సర్‌తో బాధపడుతున్న 65% మంది పిల్లలు ప్రతిరోజూ వారికి అవసరమైన కేలరీలు, ప్రోటీన్‌లలో సగం కంటే తక్కువ తీసుకుంటున్నారు. ఆరోగ్యవంతమైన పిల్లల కంటే క్యాన్సర్ ఉన్న పిల్లలకు 20-90శాతం కంటే ఎక్కువ కేలరీలు అవసరమని పరిశోధనలు సూచిస్తున్నాయి. వీరిలో కణజాల వైద్యం, శక్తి అవసరాలు, పెరుగుదల ,అభివృద్ధికి తగిన క్యాలరీలు, ప్రోటీన్ తప్పనిసరిగా తీసుకోవాలి.
 
అయినప్పటికీ, ఆకలి తగ్గడం, వాంతులు, వికారం, క్యాన్సర్ చికిత్సల  దుష్ప్రభావాల కారణంగా వారికి మరింత శక్తి అవసరం ఉంటుంది. సరైన పోషకాహారం లేకపోవడం వల్ల పిల్లల ఆరోగ్యాన్ని గణనీయంగా దెబ్బతీస్తాయి.ఇటువంటి పోషకాహారంలోపం చికిత్సకు సహకరించకపోగా మరిన్ని ఇన్‌ఫెక్షన్‌ల ప్రమాదాన్నిపెంచడానికి దారి తీస్తుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 

 ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

 ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.