Nipah Vaccine : ఏప్రిల్ నుంచి మానవులపై ‘నిఫా ’టీకా ప్రయోగాలు.. జపాన్ పరిశోధకులు సన్నద్ధం..
సాక్షి లైఫ్ : ప్రాణాంతకమైన ‘నిఫా’ వైరస్ కట్టడికి వైద్య రంగంలో కీలక అడుగు పడనుంది. గాలి ద్వారా, కలుషిత ఆహారం ద్వారా వ్యాపించి మెదడుపై తీవ్ర ప్రభావం చూపే ఈ వైరస్‌కు విరుగుడుగా జపాన్ పరిశోధకులు అభివృద్ధి చేసిన టీకా ఏప్రిల్ నుంచి మానవ ప్రయోగాలకు సిద్ధమైంది. టోక్యో యూనివర్సిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..Brain health : మీ బ్రెయిన్ కంప్యూటర్ లాగా పనిచేయాలంటే ఈ ఆహారపదార్థాలు తినండి..
ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?
క్లినికల్ ట్రయల్స్..
పరిశోధనలో భాగంగా మొదటి దశలో సుమారు 40 మంది ఆరోగ్యవంతులైన వలంటీర్లపై ఈ టీకాను పరీక్షించనున్నారు.ఈ టీకా మనుషులకు ఎంతవరకు సురక్షితం? దీనివల్ల ఏవైనా దుష్ప్రభావాలు కలుగుతాయా? అనేది ప్రాథమికంగా పరిశీలిస్తారు. శరీరంలో నిపా వైరస్‌ను ఎదుర్కొనేలా రోగనిరోధక వ్యవస్థను ఇది ఎలా ప్రేరేపిస్తుందో శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తారు.
నిఫా వైరస్..?
నిపా అనేది జంతువుల ముఖ్యంగా గబ్బిలాలు నుంచి మనుషులకు సోకే వైరస్. దీనివల్ల మరణాల రేటు (Fatality Rate) చాలా ఎక్కువగా ఉంటుంది. సుమారు 40శాతం నుంచి 75శాతం వరకు ప్రాణాపాయం ఉండే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే హెచ్చరించింది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, శ్వాసకోశ ఇబ్బందులతో మొదలై.. మెదడు వాపు (Encephalitis) వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తుంది.
ప్రాధాన్యత..
ప్రస్తుతం నిఫా వైరస్‌కు నిర్దిష్టమైన మందులు లేదా టీకాలు అందుబాటులో లేవు. కేవలం లక్షణాలను బట్టి చికిత్స అందిస్తున్నారు. ఒకవేళ జపాన్ శాస్త్రవేత్తల ప్రయోగాలు విజయవంతమైతే, భవిష్యత్తులో ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో ఇది ఒక మైలురాయిగా నిలవనుంది.
ఇది కూడా చదవండి..Obesity and inflammation : ఒబెసిటీకి ఇన్‌ఫ్లమేషన్‌కు లింక్ ఏమిటి..?
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఇది కూడా చదవండి..Coconut Water : కొబ్బరి బొండం నీళ్లతో బరువు తగ్గొచ్చా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
