Latest Study : ఆడపిల్లల్లో పెరుగుతున్న మగ హార్మోన్లు.. ఈ లక్షణాలు కనిపిస్తే ప్రమాదమే..!
సాక్షి లైఫ్ : కిశోర ప్రాయంలో 12 నుంచి 19 ఏళ్ల ఆడపిల్లల శరీరంలో సహజంగా వచ్చే మార్పులకు భిన్నంగా, ఇటీవలి కాలంలో యువతుల్లో పురుష హార్మోన్లు అంటే టెస్టోస్టిరాన్ స్థాయిలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీ వైద్యులు 8 నుంచి 18 ఏళ్ల వయసున్న 852 మంది బాలికలపై ఎనిమిది నెలల పాటు నిర్వహించిన అధ్యయనంలో 3.1 శాతం మందిలో 'టెస్టోస్టిరాన్' (male hormone) మోతాదుకు మించి ఉన్నట్లు గుర్తించారు. మహిళల్లో ఈ హార్మోన్ సాధారణ గరిష్ట స్థాయి 59 ng/dL కాగా, కొందరిలో ఇది ఏకంగా 200 ng/dL కు చేరుకోవడం గమనార్హం.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
పరిశోధనలో వెల్లడైన వాస్తవాలు ఏమిటి అంటే..?
ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీ వైద్యులు 8 నుంచి 18 ఏళ్ల వయసున్న 852 మంది బాలికలపై ఎనిమిది నెలల పాటు నిర్వహించిన అధ్యయనంలో 3.1 శాతం మందిలో 'టెస్టోస్టిరాన్' (male hormone) మోతాదుకు మించి ఉన్నట్లు గుర్తించారు. మహిళల్లో ఈ హార్మోన్ సాధారణ గరిష్ట స్థాయి 59 ng/dL కాగా, కొందరిలో ఇది ఏకంగా 200 ng/dL కు చేరుకోవడం గమనార్హం.
కనిపించే ప్రధాన లక్షణాలు..?
ముఖం, శరీరంపై అవాంఛిత రోమాలు (unwanted facial and body hair) విపరీతంగా పెరగడం. గొంతు బొంగురుపోవడం లేదా స్వరం మగవారిలా మారడం. ముఖంపై తీవ్రమైన మొటిమలు, జుట్టు రాలిపోవడం. అకారణంగా బరువు పెరగడం, శరీర ఆకృతిలో అసాధారణ మార్పులు. నెలసరి (Irregular periods) క్రమం తప్పడం లేదా రాకపోవడం.
సమస్యకు ప్రధాన కారణాలు ఏమిటి..?
ప్రతిరోజూ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్యాక్ చేసిన నిల్వ ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం. రోజుకు 4 నుంచి 6 గంటల పాటు మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్లకే అతుక్కుపోవడం. రాత్రి 11 నుంచి ఒంటి గంట దాటే వరకు నిద్రపోకుండా మెలకువగా ఉండే అలవాటు.
పొంచి ఉన్న ముప్పు..
జీవనశైలి లోపాల వల్ల తలెత్తుతున్న ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (PMOS) బారిన పడే అవకాశం ఉంది. దీనివల్ల అండాశయంలో అండాల ఉత్పత్తి దెబ్బతిని, భవిష్యత్తులో 10 నుంచి 12 శాతం మందికి సంతానలేమి (risk of infertility) సమస్యలు తలెత్తే తీవ్రమైన ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అసాధారణ లక్షణాలు గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
