New Hope for Liver Disease Patients : కాలేయ వ్యాధిగ్రస్థులకు కొత్త ఆశ.. అద్భుత ఫలితాలిస్తున్న ‘ఇకిర్వో’ మెడిసిన్..!
సాక్షి లైఫ్ : లివర్ ఇన్ఫ్లమేషన్ సమస్యతో బాధపడుతూ, సాధారణ చికిత్సలకు పూర్తిస్థాయిలో స్పందించని రోగులకు వైద్య పరిశోధకులు శుభవార్త చెప్పారు. ఇప్సన్ (Ipsen) సంస్థ రూపొందించిన ‘ఇకిర్వో’ (Iqirvo) అనే కొత్త మందు కాలేయ పనితీరును గణనీయంగా మెరుగుపరుస్తున్నట్లు తుది దశ క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైంది.
పరిశోధనలో ఏం తేలింది..?
‘ప్రైమరీ బిలియరీ కొలాంజైటిస్’ (PBC) అనే కాలేయ వ్యాధితో బాధపడుతున్న సుమారు 92 మంది రోగులపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. సాధారణంగా ఇచ్చే ‘ఉర్సోడియోక్సికోలిక్ యాసిడ్’ (Ursodeoxycholic acid) చికిత్సతో ఆశించిన ఫలితం రానివారికి, ప్రత్యామ్నాయ (second line) చికిత్సగా ఇకిర్వోను పరీక్షించారు. ఇందులో కాలేయ ఆరోగ్యంలో సానుకూల మార్పులు కనిపించాయి.
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..: Stronger Immunity : చలికాలంలో ఈ 'సూపర్ ఫుడ్స్' తీసుకుంటే.. మీ ఆరోగ్యానికి తిరుగుండదు..
ఏఎల్పీ స్థాయిలు సాధారణ స్థితికి..
కాలేయ వ్యాధి తీవ్రతను ‘ఆల్కలైన్ ఫాస్ఫేటేస్’ (ALP) అనే ఎంజైమ్ స్థాయిని బట్టి అంచనా వేస్తారు. ఈ ఎంజైమ్ మోతాదు ఎక్కువగా ఉంటే వ్యాధి చురుకుగా ఉందని, భవిష్యత్తులో కాలేయ మార్పిడి (Liver Transplant) అవసరం రావచ్చని అర్థం. అదే ఏఎల్పీ సాధారణ స్థాయికి చేరితే రోగులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన జీవనం సాగించే అవకాశం ఉంటుంది. ఏడాది పాటు సాగిన ఈ పరీక్షల్లో (ప్లాసిబో) సాధారణ మాత్రతో పోలిస్తే ఇకిర్వో ఎన్నో రెట్లు మెరుగైన ఫలితాలను ఇచ్చింది.
ఇకిర్వో తీసుకున్నవారిలో..
ఏకంగా 85.3 శాతం మంది రోగుల్లో ఏఎల్పీ స్థాయిలు సాధారణ స్థితికి వచ్చాయి. ప్రారంభ స్థాయితో పోలిస్తే వీరిలో ఏఎల్పీ సగటున 36.5 శాతం తగ్గింది.
ప్లాసిబో తీసుకున్నవారిలో..
కేవలం 23.3 శాతం మందిలోనే ఏఎల్పీ సాధారణ స్థాయికి చేరింది. వీరిలో తగ్గుదల కేవలం 4.2 శాతంగానే నమోదైంది. ‘ఎలఫిబ్రెనర్’ (Elafibranor) అనే రసాయన నామం గల ఈ ఇకిర్వో మందు ఫలితాలను ప్రముఖ వైద్య పత్రిక ‘హెపటాలజీ’ ఇటీవల ప్రచురించింది. ఈ మందు వాడిన వారిలో ఏఎల్పీ తగ్గడమే కాకుండా, కాలేయానికి సంబంధించిన ఇతర ప్రయోగశాల పరీక్షల ఫలితాలు కూడా సాధారణ స్థితికి రావడం వైద్య రంగంలో ఆశాజనక పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..: Electric Comb : బట్టతలకు ఎలక్ట్రిక్ దువ్వెన తో చెక్ పెట్టొచ్చు.. 97.85శాతం జుట్టు పెరుగుదల..
ఇది కూడా చదవండి..Tea Side effect : పరకడుపున టీ తాగితే జుట్టు ఎందుకు రాలుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
