Green Tea : గ్రీన్ టీ అందరూ తాగకూడదా..? ఎలాంటి వాళ్లు తీసుకోకూడదు అంటే..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఇటీవల కాలంలో ఆరోగ్యంగా ఉండడానికి చాలామంది  గ్రీన్ టీ ఎక్కువగా తీసుకుంటున్నారు. బరువు తగ్గాలనుకునే వారు, మెటబాలిజం పెంచుకోవాలనుకునే వారు గ్రీన్ టీ తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గ్రీన్ టీని ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన పానీయాలలో ఒకటిగా పరిగణిస్తారు. అయితే, ఇది అందరికీ అమృతంలా పని చేయదు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీ తాగితే లాభం కంటే నష్టమే ఎక్కువని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దిల్లీకి చెందిన ప్రముఖ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ రాహుల్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఎవరెవరు గ్రీన్ టీకి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..Brain health : మీ బ్రెయిన్ కంప్యూటర్ లాగా పనిచేయాలంటే ఈ ఆహారపదార్థాలు తినండి..

ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్‌ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?

 

1. కెఫీన్ పడని వారు (Caffeine Sensitivity).. 

కాఫీతో పోలిస్తే గ్రీన్ టీలో కెఫీన్ తక్కువగా ఉన్నప్పటికీ, అది కొందరిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కెఫీన్ పడని వాళ్లు.. గ్రీన్ టీ తాగడం వల్ల ఆందోళన (Anxiety), చిరాకు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా నిద్రలేమి (Insomnia) సమస్యతో బాధపడేవారు సాయంత్రం వేళల్లో దీనికి దూరంగా ఉండటం ఉత్తమం.

2. రక్తహీనత ఉన్నవారు (Iron Deficiency).. 

శరీరంలో ఐరన్ లోపం ఉన్నవారు గ్రీన్ టీ తాగే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఉండే 'టానిన్లు' మొక్కల ఆధారిత ఆహారం నుంచి లభించే ఐరన్ గ్రహణ శక్తిని తగ్గిస్తాయి. భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటే, అది కాలక్రమేణా రక్తహీనతకు దారితీసే ప్రమాదం ఉంది.

3. గర్భిణులు, పాలిచ్చే తల్లులు.. 

గర్భిణులు గ్రీన్ టీని అతిగా తీసుకోకూడదు. దీనిలోని కెఫీన్ గర్భస్థ శిశువుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల శిశువు తక్కువ బరువుతో పుట్టడం వంటి ఇబ్బందులు కలగవచ్చు. పాలిచ్చే తల్లులు కూడా వైద్యుల సలహా మేరకే దీనిని పరిమితంగా తీసుకోవాలి.

4. జీర్ణకోశ సమస్యలు ఉన్నవాళ్లు.. 

గ్రీన్ టీని ఖాళీ కడుపుతో తాగడం వల్ల పొట్టలో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల వికారం, కడుపులో మంట, అసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గ్యాస్ట్రైటిస్ లేదా అల్సర్ సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీ తాగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

5. ఇతర మందులు వాడుతున్న వాళ్లు..

బిపి, గుండె సంబంధిత వ్యాధులు లేదా రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు (Blood Thinners) మందులు వాడుతున్న వారు గ్రీన్ టీ తీసుకునే ముందు డాక్టర్‌ను సంప్రదించాలి. గ్రీన్ టీలోని కొన్ని సమ్మేళనాలు ఆయా మందుల పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం. మీ శరీర తత్వాన్ని బట్టి, మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే గ్రీన్ టీని మీ జీవనశైలిలో భాగం చేసుకోండి.

 

ఇది కూడా చదవండి..Obesity and inflammation : ఒబెసిటీకి ఇన్‌ఫ్లమేషన్‌కు లింక్ ఏమిటి..?

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి..Coconut Water : కొబ్బరి బొండం నీళ్లతో బరువు తగ్గొచ్చా..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.