Urine Odor : మూత్రం వాసన మారడానికి కారణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : మూత్రం వాసనలో మార్పు కనిపించినంత మాత్రాన అది ఇన్ఫెక్షన్ అని భయపడాల్సిన అవసరం లేదని, ఆ వాసన తాత్కాలికమా లేక కొనసాగుతోందా అనేది గమనించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆహారం..ఆస్పరాగస్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కాఫీ, కొన్ని రకాల మసాలాలు తీసుకున్నప్పుడు మూత్రం వాసనలో మార్పు రావచ్చు. విటమిన్ సప్లిమెంట్లు.. బి-కాంప్లెక్స్, విటమిన్ బి6 వంటి సప్లిమెంట్లు వాడేవారిలో మూత్రం రంగు, వాసన మారుతాయి.
కొన్ని రకాల యాంటీబయాటిక్స్, ఇతర వైద్యుల సూచిత మందుల వల్ల కూడా ఈ మార్పు కనిపిస్తుంది. రాత్రంతా నీరు తాగకుండా నిద్రపోవడం వల్ల ఉదయం వెళ్లే మూత్రం కాస్త చిక్కగా, ఘాటు వాసనతో ఉంటుంది. గర్భిణుల్లో హార్మోన్ల మార్పులు, వాసనను పసిగట్టే శక్తి పెరగడం వల్ల సాధారణ వాసన కూడా ఎక్కువగా అనిపించవచ్చు.
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
వైద్యపరమైన కారణాలు ఇవే..!
కొన్ని సందర్భాల్లో మూత్రం దుర్వాసన రావడం అంతర్గత అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు.
మూత్రనాళ ఇన్ఫెక్షన్ (UTI)..
బ్యాక్టీరియా ప్రభావం వల్ల మూత్రం తీవ్రమైన దుర్వాసన వస్తుంది. దీనికి తోడు మంట, తరచుగా మూత్ర విసర్జన, మూత్రం మసకగా రావడం వంటి లక్షణాలు ఉంటాయి. కిడ్నీ లేదా బ్లాడర్ ఇన్ఫెక్షన్..వీటి వల్ల దుర్వాసనతో పాటు నొప్పి, జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది.
మధుమేహం (Diabetes).. షుగర్ నియంత్రణలో లేనప్పుడు జీవక్రియలో మార్పుల కారణంగా మూత్రం తియ్యగా లేదా పండ్ల వాసనలా రావచ్చు. కిడ్నీలో రాళ్ల(Kidney Stones)..వల్ల మూత్రంలో రక్తం పడటం, తీవ్రమైన నొప్పితో పాటు అప్పుడప్పుడు దుర్వాసన కూడా వస్తుంది. అంతేకాదు కొన్ని రకాల లివర్ వ్యాధుల వల్ల మూత్రం అసాధారణంగా ముదురు రంగులోకి మారి, వాసనలో తేడా వస్తుంది.
నిర్లక్ష్యం వద్దు..!
మూత్రం ఘాటుగా వాసన రావడంతో పాటు మూత్ర విసర్జన సమయంలో మంట, జ్వరం, నొప్పి లేదా మూత్రంలో రక్తం కనిపిస్తే దానిని కేవలం డీహైడ్రేషన్‌గా కొట్టిపారేయకూడదని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..: Stronger Immunity : చలికాలంలో ఈ 'సూపర్ ఫుడ్స్' తీసుకుంటే.. మీ ఆరోగ్యానికి తిరుగుండదు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
