Diwali Safety Tips for Pregnant Women: దీపావళి పండుగ సందర్భంగా.. గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!
సాక్షి లైఫ్ : దీపావళి అంటేనే వెలుగులు, పండుగ సందడి, పిండివంటలు. అయితే ఈ ఉత్సాహంలో గర్భిణులు తమతో పాటు కడుపులోని బిడ్డ ఆరోగ్యం పట్ల కాస్త అదనపు శ్రద్ధ వహించాలి. టపాసుల పొగ, శబ్ద కాలుష్యం, ఆహారపు అలవాట్లలో మార్పులు గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పండుగ ఆనందాన్ని ఆస్వాదిస్తూనే, కాబోయే తల్లులు కొన్ని కీలక జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
పొగకు దూరంగా..
టపాసుల నుంచి వచ్చే పొగ గాలిని తీవ్రంగా కలుషితం చేస్తుంది. అందులోని హానికరమైన వాయువులు, సూక్ష్మ కణాలు శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తాయి. కాబట్టి గర్భిణులు టపాసులు కాల్చే ప్రదేశాలకు, పొగ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు ఇంట్లోనే ఉంటూ ఆనందించడం ఉత్తమం. బయటకు వెళ్లాల్సి వస్తే ఎన్-95 (N95) మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.
భారీ శబ్దాలతో ముప్పు..
గర్భధారణ సమయంలో పెద్ద పెద్ద శబ్దాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. భారీ శబ్దం వచ్చే బాంబులు, లౌడ్ స్పీకర్ల వద్దకు వెళ్లకూడదు. ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణంలో మాత్రమే పండుగ జరుపుకోవాలి.
ఆహారంలో నియంత్రణ..
పండుగ పూట స్వీట్లు, నూనెలో దేవేసిన పదార్థాలు ఎక్కువగా లాగించేస్తుంటారు. గర్భిణులు వీటిని చాలా పరిమితంగానే తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, పప్పులు, పాలు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. బయట మార్కెట్లో బహిరంగంగా అమ్మే స్వీట్లకు దూరంగా ఉండాలి. గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం (gestational diabetes) ఉన్నవారు వైద్యులు సూచించిన డైట్ మాత్రమే పాటించాలి.
విశ్రాంతి తప్పనిసరి..
పండుగ హడావుడిలో పడి నిద్రను నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులు, అతిథులతో నిరంతరం గడపడం వల్ల త్వరగా అలిసిపోతారు. కాస్త నీరసంగా లేదా అలసటగా అనిపించినా వెంటనే పనులు ఆపేసి విశ్రాంతి తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు మాత్రమే చిన్న చిన్న పనులు లేదా వ్యాయామాలు చేయాలి.
అగ్నికి సమీపంలో అప్రమత్తత..
గర్భిణులు స్వయంగా టపాసులు కాల్చకపోవడమే సురక్షితం. దీపాలు, కొవ్వొత్తులు వెలిగించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. సింథటిక్ దుస్తులకు బదులుగా వదులుగా ఉండే కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి. నిప్పుకు దగ్గరగా వెళ్లినప్పుడు చీర కొంగు, చున్నీల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
మందుల వాడకంలో..
బీపీ, మధుమేహం, ఆస్తమా లాంటి సమస్యలు ఉన్నవారు తమ మందులను క్రమం తప్పకుండా వేసుకోవాలి. వైద్యుల సలహా లేకుండా కొత్తగా ఎలాంటి మందులు వాడకూడదు. పండుగ హడావుడిలో రెగ్యులర్ చెకప్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా వేయవద్దు.
గర్భిణులు చేయకూడనివి..
కాలుష్యం, పొగ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు అస్సలు వెళ్లొద్దు. బరువైన వస్తువులు ఎత్తడం, శ్రమతో కూడిన పనులు చేయకూడదు. వైద్యుల సలహా లేకుండా మందులు మింగొద్దు. రాత్రి పూట ఎక్కువ సేపు మేల్కొని నిద్రను పాడుచేసుకోవద్దు. ఇంట్లో పొగతాగేవారు ఉంటే వారికి దూరంగా ఉండాలి. అలాగే ఘాటైన వాసన వచ్చే కెమికల్స్ వాడకూడదు.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
