గుండె ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు..! మహిళల్లో గుండెపోటుకు కారణమవుతున్న అలవాట్లు..   

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆధునిక జీవనశైలితో పాటు పలు దురలవాట్లు యువతరం, ముఖ్యంగా మహిళల్లో గుండె సంబంధిత సమస్యలకు కారణమవు తున్నాయని ప్రముఖ కార్డియాలజిస్ట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే గుండెపోటు కేసులు ప్రస్తుతం మధ్యవయస్కుల్లో, యువతుల్లోనూ అధికమవుతున్నాయని అంటున్నారు. ఈ అలవాట్లను విస్మరిస్తే గుండెపోటు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు.

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

 గుండెపోటుకు ప్రధాన కారణమవుతున్న అలవాట్లు..  

కొలెస్ట్రాల్ నియంత్రణ లేకపోవడం: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్ డి ఎల్) పెరగడం వల్ల ధమనుల్లో అడ్డంకులు ఏర్పడి గుండెకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి.

ప్రాసెస్ చేసిన చక్కెర అధిక వినియోగం: స్వీట్లు, ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఉండే అధిక చక్కెర గుండెకు హానికరం. ఇది డయాబెటిస్, శరీరంలో వాపు, గుండె బలహీనతకు దారితీస్తుంది. చక్కెరను తగ్గించి, తేనె, పండ్ల వంటి సహజ స్వీట్నర్లను ఉపయోగించడం మంచిది.

ధూమపానం, మద్యపానం: పొగతాగడం, అధికంగా మద్యం సేవించడం రక్తపోటును పెంచి, గుండె లయను దెబ్బతీస్తాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి. ఈ అలవాట్లను పూర్తిగా మానేయడం అత్యవశ్యకం.

వ్యాయామం లేకపోవడం: శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరిగి, గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం గుండె ఆరోగ్యానికి చాలా అవసరం.

ఒత్తిడి: దీర్ఘకాలిక ఒత్తిడి కార్టిసాల్ వంటి హార్మోన్ల విడుదలకు దారితీసి రక్తపోటు, గుండె స్పందన రేటును పెంచుతుంది. ఇది గుండె రక్త నాళాలను దెబ్బతీసి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. యోగా, ధ్యానం వంటివి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి.

నిద్రలేమి: తగినంత నిద్ర లేకపోవడం వల్ల గుండె విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఉండదు. ఇది హృదయనాళ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరి.

అధిక సోడియం వినియోగం: ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది, ఇది గుండె జబ్బులకు ప్రధాన కారణం. ఆహారంలో సోడియం తగ్గించుకోవడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.