ప్రీ-మెనోపాజ్‌ ను ఎదుర్కోవటానికి సరైన పరిష్కార మార్గాలు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మహిళలు తమ ఆహారంలో పోషకాహారాన్ని చేర్చుకోవడం ద్వారా శారీరకంగా,మానసికంగా హెల్తీగా ఉండవచ్చు. మహిళలు ముఖ్యంగా క్యాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని ఆహారంలో చేర్చుకోవాలి. ఎందుకంటే మెనోపాజ్ తర్వాత మహిళల్లో బోలు ఎముకల వ్యాధి ముప్పు పెరుగుతుంది.

 ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

వ్యాయామం.. 

మంచి నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి మానసిక  ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడుతాయి. మెనోపాజ్ కారణంగా బరువు కూడా వేగంగా పెరుగుతారు. వ్యాయామం చేస్తే బరువును నియంత్రించవచ్చు.

ఇలాంటి ఆహారానికి దూరంగా ఉండండి.. 

కెఫిన్, ఆల్కహాల్ , స్పైసీ ఫుడ్ తీసుకోవడం మానుకోండి. వీటిని తీసుకోవడం వల్ల మెనోపాజ్ సమయంలో అధికంగా వేడి చేస్తుంది.  ఎందుకంటే ఈ ఆహారాలు మెనోపాజ్ సమయంలో సంభవించే 'హీట్ ఫ్లాషెస్'ని ప్రోత్సహిస్తాయి.

పుష్కలంగా నీరు తాగాలి.. 

మెనోపాజ్ కారణంగా మహిళలల్లో చర్మం, జుట్టు, గోర్లు పొడిగా మారుతాయి. ఈ సమస్యలను నివారించడానికి తగినంత నీరు తీసుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రీ-మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.

ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.