Iron deficiency : మహిళల్లో ఐరన్ లోపాన్ని నివారించే మార్గాలు ఏమిటి..? 

సాక్షి లైఫ్ : మహిళల్లో ఐరన్ (iron deficiency)లోపానికి సంబంధించి పలు లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా వాటిని అధిగమించాలని చెబుతున్నారు వైద్యనిపుణులు. అటువంటి వాటిలో(fatigue and weakness) అలసట, బలహీనత ప్రధానంగా కనిపిస్తాయని, నిరంతర అలసట, బలహీనత ఐరన్ లోపానికి(iron deficiency) ప్రధాన లక్షణాలని వారు అంటున్నారు.  

 

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందకపోవడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా మారవచ్చు. తల తిరగడం: తలనొప్పి, తల తిరిగినట్లు అనిపించడం. చర్మం పాలిపోవడం: హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల చర్మం పాలిపోయినట్లు కనిపిస్తుంది. గోర్లు పెళుసుగా మారడం: గోర్లు బలహీనంగా మారి, సులభంగా విరిగిపోతాయి.

జుట్టు రాలడం(Hair loss): ఐరన్ లోపం(iron deficiency)వల్ల జుట్టు ఎక్కువగా రాలవచ్చు. చలిగా అనిపించడం: శరీర ఉష్ణోగ్రత (Body temperature)తగ్గుతుంది, దీనివల్ల చలి ఎక్కువగా ఉంటుంది. నాలుక వాపు నొప్పి: నాలుక వాపు, నొప్పిగా ఉంటుంది. అసాధారణమైన కోరికలు: మట్టి, ఐస్ లేదా ఇతర తినడానికి పనికిరాని పదార్థాలు తినాలనే కోరిక కలగవచ్చు.

ఐరన్ లోపాన్ని నివారించే మార్గాలు..(Ways to prevent iron deficiency)

ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి: పాలకూర, బీట్‌రూట్, పప్పులు, మాంసం, గుడ్లు, డ్రై ఫ్రూట్స్, విత్తనాలు వంటి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని మీ రోజువారీ డైట్‌లో చేర్చుకోండి.

విటమిన్-సి (vitamin C) ఆహారాలు తీసుకోండి: విటమిన్-సి ఐరన్ శోషణకు సహాయపడుతుంది. (oranges, lemons, grapes, and strawberries) నారింజ, నిమ్మకాయ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ వంటివి తీసుకోండి.

 మీకు ఐరన్ లోపం ఉందని అనుమానం ఉంటే, రక్త పరీక్షల ద్వారా నిర్ధారించుకొని, వైద్యుని సలహా ప్రకారం మందులు తీసుకోవడం ఉత్తమం. ఐరన్ టాబ్లెట్లు, క్యాప్సూల్స్ లేదా సిరప్‌ల (tablets, capsules, or syrups)రూపంలో అందుబాటులో ఉంటాయి. వీటిని ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల శరీరం ఐరన్‌ను బాగా గ్రహిస్తుంది. 

 

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : iron iron-test foods-with-iron iron-in-food best-iron-rich-foods how-to-increase-iron-in-blood vegan-iron-rich-foods vegetables-high-in-iron iron-food-list list-of-foods-high-in-iron iron-deficiency-anemia-symptoms iron-deficiency-anemia
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com