సాక్షి లైఫ్ : ప్రొటీన్ అనేది మన శరీరంలోని ప్రతి కణానికి అవసరమైన ముఖ్యమైన పోషకం. కార్బోహైడ్రేట్లు , కొవ్వుల వంటి ప్రోటీన్లను శరీరం నిల్వ చేయలేదు. కాబట్టి మీరు ప్రతిరోజూ ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తినాలి.ప్రోటీన్ ఫుడ్ కండరాల పెరుగుదలకు మాత్రమే కాకుండా, ఎముకలు, కీళ్ళు, జుట్టు, యాంటీబాడీస్, హార్మోన్లు, ఎంజైమ్‌లకు కూడా అవసరం.