శానిటరీ ప్యాడ్స్ కూడా క్యాన్సర్ కారకాలేనా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : శానిటరీ ప్యాడ్స్ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుందా అనే విషయంపై ఖచ్చితమైన సమాధానం లేదు. అయితే, కొన్ని అధ్యయనాలు ,నివేదికలు శానిటరీ ప్యాడ్స్‌లో ఉండే కొన్ని రసాయనాల గురించి ఆందోళనలను లేవనెత్తాయి. ఈ ఉత్పత్తులలో కొన్ని హానికరమైన రసాయనాలు ఉన్నాయని దీనికారణంగానే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నాయి పరిశోధనలు. 

ఇది కూడా చదవండి..పిల్లలకు కాల్షియం ఎందుకు ముఖ్యమైనది అంటే..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

ప్రస్తుతం మనకు మార్కెట్ లో అందుబాటులో ఉన్న అన్నిరకాల రకాల శానిటరీ ప్యాడ్ల తయారీలో ఎక్కువగా థాలేట్స్, కర్బన సమ్మేళనాలు వొలాటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ వంటి విషపూరితమైన కెమికల్స్ ను వినియోగిస్తున్నారు. ఎక్కువరోజులు చెక్కుచెదరకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో పలు శానిటరీ ప్యాడ్స్ తయారీ సంస్థలు థాలేట్స్‌ ను మిక్స్ చేస్తున్నాయి. థాలేట్స్ యుక్తవయస్సులో శరీరంలో మార్పులను ప్రేరేపిస్తాయి.

అంతేకాదు వీటి కారణంగా క్యాన్సర్, సంతానోత్పత్తి విషయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (ఎన్‌సీబీఐ) చెబుతోంది. మరోపక్క శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేదని, కానీ కొన్నిసార్లు ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందని, అందుకే నెలసరి సమయంలో మెన్ట్రువల్ కప్స్ వినియోగించమని గైనకాలజిస్టులు చెబుతున్నారు.
 
గత 40 ఏళ్ల క్రితం చాలా మంది మెత్తటి చీరలను లేదా పంచలను ఇందుకోసం ఉపయోగించేవాళ్లు. అవి కూడా ఎక్కువ కాలం వాడకూడదు. ఎందుకంటే బ్యాక్టిరియల్ ఇన్‌ఫెక్షన్స్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.  పలు ఎంజీవో సంస్థలు  క్లాత్ తో తయారు చేసిన శానిటరీ నాప్కిన్స్‌ను అందిస్తున్నాయి. అటువంటివాటివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. 

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.