స్పాండిలోసిస్ సమస్యలు - పరిష్కార మార్గాలు..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మెడ, తల, భుజాలలో నిరంతర నొప్పి స్పాండిలోసిస్ సమస్య కావచ్చు. సకాలంలో చికిత్స చేయకపోతే, ఇది తీవ్రమైన సమస్యగా మారుతుంది. సాధారణంగా ప్రజలు ఈ తీవ్రమైన నొప్పిని వదిలించుకోవడానికి పెయిన్ కిల్లర్లను వాడుతుంటారు. మరి కొంతమంది ఇంటి చిట్కాలను కూడా ప్రయత్నిస్తారు. పెయిన్ కిల్లర్స్ ప్రభావం కూడా కొంత సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి దీని కోసం మీరు మీ కొన్ని అలవాట్లపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఈ అలవాట్లు కూడా ఈ నొప్పిని పెంచుతాయి.  

ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?

 

వెన్నుకు సంబంధించిన ఎముకలు..

స్పాండిలోసిస్‌ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే హెల్తీగా ఉండొచ్చు..?  మెడలో ఉన్న వెన్నుకు సంబంధించిన ఎముకలు అరిగి.. రాపిడికి గురైనప్పుడు వెన్నుపూసల నరాలపై ఒత్తిడి పడుతుంది. దీని కారణంగా తలెత్తే నొప్పిని ‘స్పాండిలోసిస్‌’ అంటారు. ఈ నొప్పి తగ్గాలంటే.. ఏం చేయాలి..? అసలు ఈ సమస్య రాకుండా ముందుగా స్పాండిలోసిస్‌ నివారణ కోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

స్పాండిలోసిస్‌ వచ్చిన తర్వాత కానీ రాకముందుగానీ తప్పనిసరిగా చేయాల్సినవి, చేయకూడని వాటి గురించి తెలుసుకోవాలి. అవేంటంటే..? ఎక్కువగా బరువు ఉండే వస్తువులు.. అంటే సూట్‌కేసులు, బ్రీఫ్‌కేసులు, నీళ్లబకెట్లు, ల్యాప్‌టాప్‌లు మోయడం వంటివి చేయకూడదు. మూటలు, గంపలు వంటి అధికంగా బరువైనవాటిని కూడా తలపై మోయకూడదు.

రాత్రి సమయంలో పడుకునేతప్పుడు తలగడ కేవలం తల కింది వరకే కాకుండా భుజాల దాకా ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు మెడకు కొంత సపోర్ట్‌ గా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.

ఎలాంటి జాగ్రత్తలు.. 

ఒకవేళ తలగడ అందుబాటులో లేకపోతే కనీసం ఒక బెడ్‌షీట్‌ నాలుగు ఇంచుల ఎత్తుగా ఉండేలా మడత వేసి దిండులా తల కింద పెట్టుకోవాలి. దాని మీద ఓ టర్కీ టవల్‌ను రోల్‌ చేసినట్లుగా చుట్టి మెడకింద పెట్టుకోవాలి. మూడు నెలల నుంచి ఆర్నెల్ల వరకు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి.

దిండు లేకుండా పడుకోకూడదు.. 

ఈ సమస్య ఉన్నప్పుడు దిండు లేకుండా పడుకోకూడదు. తలగడ ఉండటం వల్లనే తప్పనిసరిగా మెడకూ, భుజాలకు సపోర్ట్ గా ఉంటుంది.
సమస్య రెండో దశలో ఉన్నప్పటికీ మందులతో పాటు ఇక్కడ పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటే సమస్య దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. అప్పటికీ తగ్గక పొతే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.

ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..

ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.