వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే..  

షేర్ చేయండి:
వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే..  

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా 1.8 బిలియన్ల మంది ప్రతి నెల రుతుస్రావం అవుతున్నారు. లక్షలాది మంది అమ్మాయిలు, మహిళలు తమ ఋతుచక్రాన్ని గౌరవప్రదంగా, ఆరోగ్యకరమైన రీతిలో నిర్వహించ లేకపోతున్నారు. అంతేకాదు బహిష్టు అయిన సమయంలో సరైన పరిశుభ్రత లేక చాలామంది అనేక రోగాల బారీన పడుతున్నారు. అందుకోసమే వారిలో అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా మే 28న వరల్డ్ మెన్ స్ట్రువల్ హై జీన్ డేని జరుపుతున్నారు.    

ఇది కూడా చదవండి.. కల్తీ ఆహారాన్ని గుర్తించడం ఎలా..?  

సామాజిక బహిష్కరణ.. 

రుతుక్రమం ప్రారంభమవడం అంటే కౌమారదశలో ఉన్నవారి జీవితాల్లో కొత్త దశ. చాలా మంది కౌమారదశలో ఉన్న బాలికలు ఋతుస్రావం సమయంలో వేధింపులు, సామాజిక బహిష్కరణకు గురవుతున్నారు. లింగమార్పిడి పురుషులు కూడా వివక్షను ఎదుర్కొంటున్నారు. వారికి అవసరమైన ఉత్పత్తులు, సౌకర్యాలు అందుకోలేక పోతున్నారు.

ప్రపంచ ఋతు పరిశుభ్రత దినోత్సవం.. 

లింగ అసమానత, వివక్షాపూరితమైన సామాజిక నిబంధనలు, సాంస్కృతిక నిషేధాలు, పేదరికం, మరుగుదొడ్లు సౌకర్యాలు లేమి, శానిటరీ ఉత్పత్తుల లేమి వంటి ప్రాథమిక సేవల కొరత అనేవి ఋతు ఆరోగ్యం, పరిశుభ్రత అవసరాలను తీర్చలేకపోతున్నాయి. కాబట్టి అటువంటి వాటిపై శ్రద్ధ పెట్టడంతోపాటు, మరింత అవగాహన కల్పించేందుకు, జనాల్లో ఉన్న అపోహలను తొలగించడం కోసం మే 28తేదీన ప్రపంచ ఋతు పరిశుభ్రత దినోత్సవం జరుపుతున్నారు. 

ఇది కూడా చదవండి.. మహిళల్లో జననేంద్రియ సమస్యలకు కారణాలు ఏమిటి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.