మహిళల్లో ఐరన్ లోపానికి ముఖ్య కారణాలు ఏమిటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఐరన్ లోపం(Iron deficiency) ఆరోగ్యానికి చాలా హానికరం(harmful to health), ముఖ్యంగా (women)మహిళల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సరిగా ఆహారం తీసుకోకపోవడం లేదా కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఈ సమస్య రావచ్చు. ఐరన్ లోపం వల్ల కలిగే లక్షణాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఐరన్ మన శరీరానికి ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది హిమోగ్లోబిన్ తయారు చేయడానికి అవసరం.

 ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మెడిసిన్స్ లేకుండా హైబీపీని తగ్గించే చిట్కాలు..?

ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

ఐరన్ లోపం (Iron deficiency) ఎందుకు తలెత్తుతుంది..?

ఐరన్ మన శరీరానికి ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది హిమోగ్లోబిన్ తయారు చేయడానికి అవసరం. హిమోగ్లోబిన్(Hemoglobin) శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌(oxygen)ను చేరవేస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఐరన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఐరన్ లోపం వల్ల అనీమియా (రక్తహీనత) వస్తుంది, దీనివల్ల అలసట, బలహీనత, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

 మహిళల్లో ఐరన్ లోపానికి (iron deficiency in women)కొన్ని ముఖ్య కారణాలు.. ?

ఋతుస్రావం (Periods): నెలసరి సమయంలో రక్తం పోవడం వల్ల శరీరంలో ఐరన్ స్థాయిలు తగ్గుతాయి.

గర్భిణీలు, బాలింతలు: గర్భధారణ, పాలిచ్చే సమయంలో మహిళలకు ఎక్కువ ఐరన్ అవసరం అవుతుంది.

 సరైన ఆహారం లేకపోవడం(Malnutrition): ఐరన్  (iron)ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడం.

జీర్ణ సంబంధిత సమస్యలు: కొన్ని వ్యాధులు (ఉదాహరణకు, సీలియాక్ వ్యాధి, అల్సరేటివ్ కొలైటిస్) ఐరన్ (iron) శోషణకు అడ్డంకిగా మారతాయి.

అధిక రక్తస్రావం: అల్సర్లు లేదా క్యాన్సర్ (ulcers or cancer) వంటి కారణాల వల్ల అధిక రక్తస్రావం జరిగితే ఐరన్ లోపం ఏర్పడుతుంది.

 

ఇది కూడా చదవండి..ప్యాక్ చేసిన జ్యూస్‌లతో ఎలాంటి దుష్ప్రభావాలున్నాయంటే..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.