సాక్షి లైఫ్ : ప్రెగ్నెన్సీ సమయంలో కొన్నివిషయాల్లోజాగ్రత్తలు పాటిస్తే తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. గర్భధారణ సమయంలో మహిళలు తమ ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. కానీ వేసవికాలంలో ఇది చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఈ సీజన్‌లో డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, డయేరియా, గ్యాస్, ఎసిడిటీ వంటి అనేక అనారోగ్యసమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎండాకాలంలో గర్భధారణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి.. బరువు తగ్గడానికి అడపాదడపా ఉపవాసం మంచిదేనా..?
భారతదేశంలో వేసవి కాలం ఎక్కువ కాలం ఉంటుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు తీవ్రమైన వేడి ఉంటుంది. సరైన జాగ్రత్తలు పాటించకుంటే అనేక అనారోగ్య సమస్యల బారీన పడాల్సి వస్తుంది. వేసవి కాలం పిల్లలు ,వృద్ధులకు మాత్రమే ప్రమాదకరం కాదు, గర్భిణీ స్త్రీలు కూడా. ఈ సీజన్‌లో తప్పనిసరిగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారం..
గర్భిణీల విషయంలో అత్యంత ముఖ్యమైన విషయం ఆరోగ్యకరమైన ఆహారం. ఈ సీజన్‌లో వారికి ఏమీ తినాలని అనిపించదు, అయితే పిల్లల ఆరోగ్యం కోసం, వారు అన్ని రకాల పోషకాలను కలిగిన సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. అంటే, వేయించిన, కాల్చిన లేదా స్పైసీ ఫుడ్ తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆకు కూరలు, తృణధాన్యాలు, గింజలు, విత్తనాలు గర్భిణీలకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
ఎండ దెబ్బ తగలకుండా ఉండండి..
తప్పనిసరి అయితే తప్ప, వేసవిలో ఎండలోకి వెళ్లకూడదు. ఉంష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు గర్భిణీలు బయటకువెళ్తే ఎండ వేడికి చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు రక్తపోటులో హెచ్చుతగ్గులను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఎండలో బయటకు వెళ్లేటప్పుడు, సన్ గ్లాసెస్ ,టోపీని ధరించడం మర్చిపోవద్దు, చర్మానికి సన్‌స్క్రీన్‌ను కూడా అప్లై చేసుకోవాలి.
ఇది కూడా చదవండి.. వేసవిలో కళ్లు ఎర్రబడుతున్నాయా..? ఇవిగో చిట్కాలు..
సౌకర్యవంతమైన బట్టలు..
గర్భధారణ సమయంలో శరీర ఉష్ణోగ్రత సహజంగా పెరుగుతుంది, కాబట్టి ఎల్లప్పుడూ సౌకర్యవంతమైన, కాటన్ దుస్తులను ధరించండి. చాలా బిగుతుగా, గట్టి బట్టతో చేసిన దుస్తులు సుఖంగా ఉండవు, ఇవి చిరాకు కలిగించడమే కాకుండా, చర్మంపై చెమట ఆరిపోకుండా ఉండటం వల్ల, బ్యాక్టీరియా అధికంగా పెరుగుతుంది. ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు.
హైడ్రేటెడ్ గా ఉండండి..
ప్రెగ్నెన్సీ సమయంలో పొరపాటున కూడా శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి. వేసవి కాలంలో చెమట ఎక్కువగా ఉంటుంది కాబట్టి, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి, లోపలి నుంచి చల్లగా ఉంచడానికి పుష్కలంగా నీరు తాగటం చాలా ముఖ్యం. ఆఫీస్ కు వెళ్తే తప్పనిసరిగా ఎప్పుడూ వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి.
వ్యాయామం-యోగా..
గర్భిణీ స్త్రీకి వ్యాయామం చాలా ముఖ్యం. దీని వల్ల తల్లితో పాటు బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారు. యోగా చేయడం, వ్యాయామం చేయడం ద్వారా శారీరకంగా చురుకుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తద్వారా గర్భధారణ సమయంలో శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల కలిగే మూడ్ స్వింగ్‌లను కూడా తగ్గించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే, యోగా,వ్యాయామం చేసేందుకు ముందుగా వైద్యుడి సలహా తీసుకోవాలి. పరీక్షల తర్వాత, వారు సూచించిన వ్యాయామాలను మాత్రమే చేయాల్సి ఉంటుంది.