బరువు తగ్గడానికి అడపాదడపా ఉపవాసం మంచిదేనా..?
సాక్షి లైఫ్ : అడపాదడపా ఉపవాసం అనేది చాలా మంది బరువు తగ్గడానికి, ఫిట్‌గా ఉండటానికి ఇటీవల అనుసరిస్తున్న ట్రెండీ ప్రయోగాలలో ఒకటి. ఇది ఎనిమిది గంటలలోపు ఒక రోజుకు అవసరమైన అన్ని ప్రధాన భోజనాలను తింటూ, మిగిలిన సమయంలో ఉపవాసం ఉండే విధానం. ఇలాంటి బరువు తగ్గించే విధానాలు గుండెపోటుతో మరణించే ప్రమాదాన్ని పెంచుతాయని తాజా అధ్యయనం కనుగొంది.
ఇది కూడా చదవండి.. వేసవిలో కళ్లు ఎర్రబడుతున్నాయా..? ఇవిగో చిట్కాలు..
అడపాదడపా ఉపవాసం విషయంలో అల్పాహారం మానేసి, మధ్యాహ్న భోజనం ,రాత్రి ఎనిమిది గంటలకు రాత్రి భోజనం చేయాలి. ఇలా తినడం గుండెకు మంచిది కాదని 20 వేల మందిపై అధ్యయనం చేసిన పరిశోధకులు చెబుతున్నారు. అడపాదడపా ఉపవాసం పాటించే వారిలో గుండె జబ్బులతో మరణించే అవకాశం ఎక్కువ అని పరిశోధకులు చెబుతున్నారు.
అడపాదడపా ఉపవాసం చేయడం వల్ల గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారిలో గుండె జబ్బులు లేదా స్ట్రోక్‌తో మరణించే ప్రమాదం 66 శాతం పెరుగుతుందని నివేదిక పేర్కొంది. అమెరికాలోని చికాగోలో జరిగిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనం ఫలితాలు వెల్లడించాయి. ఐతే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వర్గాలు ఈ ఫలితాలు ప్రాథమికంగా మాత్రమే ఉన్నాయని, పూర్తిగా అధ్యయన నివేదిక ఇంకా విడుదల చేయవలసి ఉందని చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి.. ఈ సూపర్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి డోకా ఉండదు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
