40 ఏళ్ల లోపు యువతలో క్యాన్సర్ కేసులు ఎందుకు ఎక్కువగా పెరుగుతున్నాయి..?
సాక్షి లైఫ్ : భారతదేశంలో 40 సంవత్సరాల లోపు యువతలో క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరిగాయి. ప్రధానంగా జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, పర్యావరణ కాలుష్యం వంటి కారణాల వల్ల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
క్యాన్సర్ రకాల పెరుగుదల..
బ్రెస్ట్ క్యాన్సర్: యువతులలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరిగాయి. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, పర్యావరణ కాలుష్యం వంటివి కారణాలు.
పేగు క్యాన్సర్: పేగు క్యాన్సర్ కేసులు కూడా పెరిగాయి. ఇది ప్రధానంగా అధిక కొవ్వు ఆహారం, ప్రాసెస్డ్ ఫుడ్స్, శారీరక చురుకుదనం లోపం వల్ల ఈ కేసులు పెరుగుతున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు.
ప్రధాన కారణాలు..
ఆహారపు అలవాట్లు: ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక కొవ్వు ఆహారం, చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారపు అలవాట్లు క్యాన్సర్ రిస్క్ ను పెంచుతాయి.
శారీరక శ్రమ లేకపోవడం : ఎక్కువగా కూర్చొని చేసే ఉద్యోగులు శారీరక చురుకుదనం లోపం వల్ల ఒబెసిటీ పెరుగుతుంది, ఇది క్యాన్సర్ రిస్క్ ను పెంచుతుంది.
పర్యావరణ కాలుష్యం: పర్యావరణ కాలుష్యం వల్ల శరీరంలో టాక్సిన్లు చేరి క్యాన్సర్ రిస్క్ ను పెంచుతాయి.
జన్యు కారణాలు: BRCA1 అండ్ BRCA2 వంటి జన్యు మార్పులు కూడా క్యాన్సర్ రిస్క్ ను పెంచుతాయి.
ఇది కూడా చదవండి..మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 5 రోజువారీ అలవాట్లు..
ఇది కూడా చదవండి..20 ఏళ్లలోపు వారికే గుండెపోటు ఎక్కువగా రావడానికి ప్రధాన కారణాలు..
ఇది కూడా చదవండి..బాడీ బిల్డింగ్ కోసం ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
