హిమోఫిలియా వ్యాధి ఎందుకు వస్తుంది..? ఎలాంటివాళ్లకు ప్రమాదం..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : హిమోఫిలియా వ్యాధి కేసులు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మరింతగా పెరుగుతున్నాయి. ఈ సమస్యకు సరైన సమయంలో సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాలకే ముప్పు అని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. హిమోఫిలియా అనేది అరుదైన రక్త సంబంధిత సమస్య. ఈ వ్యాధి వచ్చిన వ్యక్తులలో రక్తం గడ్డకట్టదు. ఎందుకంటే రక్తంలో గడ్డకట్టే ప్రోటీన్లు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.  
 

ఇది కూడా చదవండి..కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి..? వాటికి కారణమేమిటి..?

ఇది కూడా చదవండి..విటమిన్స్ అన్నిటిని పొందాలంటే..? ఏమిచేయాలి..?

ఇది కూడా చదవండి..నెఫ్రోలిథియాసిస్ అంటే ఏమిటి..?

 

హిమోఫిలియా లక్షణాలు..? 

బ్రెయిన్ లో బ్లీడింగ్ అవ్వడం..  
అప్పుడప్పుడు వాంతులు అవ్వడం..  
చాలా కాలంగా తలనొప్పిగా అనిపించడం.. 
బలహీనంగా అనిపించడం.. 
బ్లీడింగ్ అవుతుంది.. 
మలంలో కానీ మూత్రంలో కానీ రక్తం.. 
కీళ్ల వాపు, నొప్పి..  
ముక్కు నుంచి బ్లీడింగ్ అవ్వడం.. 


రక్తస్రావం.. 

ఈ వ్యాధి ఉన్నవాళ్లు ఎలాంటి గాయాలు, దెబ్బలు, ప్రమాదాలు తగల కుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్లకు చిన్న గాయమైనా  రక్తం కారుతూ ఉంటుంది. ఈ వ్యాధి శరీరం లోపల రక్తస్రావం అవుతుంది. హీమోఫిలియా వల్ల మోకాళ్లు, చీలమండలు, మోచేతులలో బ్లీడింగ్ అవ్వొచ్చు. శరీరంలోపల బ్లీడింగ్ అవ్వడం వల్ల బాడీ లోని అవయవాలు, కణజాలాలు  దెబ్బతింటాయి. ఇలా జరిగితే మనిషి ప్రాణాలకే ప్రమాదం జరగవచ్చు. కనుక ఈ వ్యాధి వచ్చినవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

హిమోఫిలియాకు ప్రధాన కారణాలు..?

హిమోఫిలియా అనేది జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్లనే ఎక్కువగా వస్తుంది. 40 ఏళ్లు పైబడినవారు, వృద్ధులను ఈ వ్యాధి తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. హిమోఫిలియా వచ్చిన వారిలో జన్యువులలో మార్పులు జరుగుతాయి. ఫలితంగా రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రోటీన్ అందుబాటులో ఉండదు. ఒకవేళ హిమోఫిలియా కుటుంబంలో ఎవరికైనా ఉంటే, ఆయా ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ మహమ్మారి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. హిమోఫిలియాను ముందుగా స్క్రీనింగ్ ద్వారా గుర్తించి చికిత్స చేస్తే అదుపులోఉంటుంది.

  
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.