సాక్షి లైఫ్ : ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఈ అకాల ఉష్ణతాపం సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, మురికివాడల్లో నివసించే గర్భిణుల పరిస్థితి అత్యంత దయనీ యంగా మారింది. ముఖ్యంగా నిరుపేద గర్భిణులు కనీస సౌకర్యాలు లేక 'భానుడి భాగభాగాల్లో ఉడికిపోతున్నారు. మురికివాడల్లో ఉండే వారి పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడి ఇరుకైన గదులు, పైన రేకుల కప్పులు మధ్యాహ్న సమయానికి నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. స్తోమత ఉన్నవారు ఏసీలు, కూలర్లతో సేదతీరుతుంటే.. మారుమూల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే గర్భిణులకు మాత్రం రాత్రంతా నిద్ర కరువవుతోంది. ఉక్కపోత, ఆందోళన, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో వారు నరకయాతన పడుతున్నారు.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
తల్లికి, బిడ్డకు పొంచి ఉన్న ముప్పు..
తీవ్రమైన ఎండలు గర్భిణులపై చూపే ప్రభావంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల పురుషుల కంటే మహిళలే 14 రెట్లు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
అధిక వేడి వల్ల హృదయ స్పందన రేటు పెరిగి, నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ప్రమాదం ఉంది. గర్భధారణ రెండో దశలో తీవ్రమైన ఎండల ప్రభావం ఉంటే, పుట్టబోయే బిడ్డల్లో పుట్టుకతో వచ్చే లోపాలు తలెత్తే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేడి కారణంగా గర్భిణుల్లో రక్తపోటు పెరగడం, తల తిరగడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మురికివాడల్లో నివసించే వారు కేవలం ఎండలతోనే కాకుండా, పెరుగుతున్న వాయు కాలుష్యం వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు, కూలి పనులకు వెళ్లే గర్భిణులు గంటల తరబడి ఎండలో ఉండటం వల్ల వడదెబ్బకు గురవుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల వీరు పౌష్టికాహారం, సరైన వైద్య పరీక్షలకు కూడా దూరమవుతున్నారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు..
ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నిపుణులు గర్భిణులకు పలు సూచనలు చేస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు రాకపోవడం ఉత్తమం. శరీరంలో నీటి శాతం తగ్గకుండా తరచూ నీరు, పండ్ల రసాలు తీసుకోవాలి. తలనొప్పి, వాంతులు, అధిక ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
మహిళా రిజర్వేషన్లు, సాధికారతపై చర్చలు ఒకవైపు జరుగుతున్నా.. కనీసం నీడ, చల్లని గాలికి నోచుకోని ఈ 'మాతృమూర్తుల' ఆర్తనాదాలు సామాజిక అసమానతలకు అద్దం పడుతున్నాయి. ప్రకృతి ప్రకోపానికి బలైపోతున్న ఈ నిరుపేద గర్భిణులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com