చంద్రగ్రహణం సమయంలో గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
సాక్షి లైఫ్ : ఈ రోజు ఈ సంవత్సరంలో రెండో చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీని ప్రభావం కొన్నిరాశులవారికి ప్రతికూలంగానూ, మరికొందరికి అనుకూలంగానూ ఉంటుందని పండితులు వెల్లడిస్తున్నారు. ఇది భాద్రపద మాసం పౌర్ణమి రోజున జరగనుంది. సూర్యుడు, చంద్రునికి మధ్య భూమి వచ్చినప్పుడు, భూమి నీడ చంద్రుని పై పడుతుంది. ఈ సమయంలో పాక్షిక, సంపూర్ణ లేదా పెనుంబ్రల్ గ్రహణం ఏర్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, ఈ గ్రహణం సమయంలో గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..ఏ శస్త్రచికిత్సలకు అనస్తీషియా అవసరం?
ఇది కూడా చదవండి..పీఎం నరేంద్ర మోడీ ఆరోగ్య రహస్యాలు..
ఇది కూడా చదవండి..బ్యాడ్ కొలెస్ట్రాల్ మందులతో పని లేకుండా తగ్గుతుందా..? అది ఎలా..?
గ్రహణ సమయాలు..
భారత కాలమానం ప్రకారం, ఈ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 18 ఉదయం 6:12 గంటలకు ప్రారంభమై, రాత్రి 10:17 గంటలకు ముగుస్తుంది. ఉదయం 7:42 గంటలకు పాక్షిక చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. ఉదయం 8:14 గంటలకు చంద్రగ్రహణం ముగింపు దశలో ఉంటుంది. ఈ గ్రహణం మొత్తం 4 గంటల 5 నిమిషాల పాటు కొనసాగుతుంది. అయితే, ఈసారి గ్రహణం సూతకం ప్రభావం ఉండదు, ఎందుకంటే ఈ సమయం భారతదేశంలో పగటిపూట ఉంటుంది. అందుకే, ఈ గ్రహణం భారతదేశ ప్రజలకు కనిపించదు.
జాగ్రత్తలు..
చంద్రగ్రహణం సమయంలో సూతకం వస్తుంది, ఇది అశుభమైనదిగా పరిగణిస్తారు. ఈ కాలంలో శుభకార్యాలు చేయడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు ఇంటి నుంచి బయటకు రాకూడదని, ఈ సమయంలో మహిళలు తమ గర్భంలోని శిశువు పట్ల జాగ్రత్తగా ఉండాలని పండితులు వెల్లడిస్తున్నారు.
గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడకూడదని,ఈ విషయంలో గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. అలాగే, గ్రహణ సమయంలో పదునైన వస్తువులు అంటే కత్తి, బ్లేడు వంటి వాటిని ఉపయోగించకూడదని, పండ్లు, కూరగాయలు కట్ చేయవద్దని సూచిస్తున్నారు. గర్భిణీలు లోహ వస్తువులకు దూరంగా ఉండడం మంచిదని వారు అంటున్నారు.
ఇది కూడా చదవండి..చెంచాతో కాకుండా చేతులతో తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..చిన్నారుల్లో కార్డియాక్ అరెస్ట్ కారణాలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
