ఓట్జెంపిక్ డ్రింక్ కు పెరుగుతున్న క్రేజ్.. ఎందుకంటే..? 

సాక్షి లైఫ్: తక్కువ కేలరీల షేక్స్ నుంచి బరువు తగ్గించే ఇంజెక్షన్ల వరకు బరువు తగ్గడానికి అనేక రకాల పరిష్కారమార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బరువు తగ్గించే పోకడలకు కేంద్రంగా మారింది సోషల్ మీడియా. "ఓట్జెంపిక్" డ్రింక్ అత్యంత వేగంగా వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో దీని పట్ల క్రేజ్ పెరుగుతోంది.

ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..? 

 

ఇది కూడా చదవండి.. హిమోఫిలియా ఎలా నయం అవుతుంది..?

వెయిట్ లాస్..

సోషల్ మీడియాలో అత్యంతగా ట్రెండింగ్ లో ఉన్నపదం ఓట్‌జెంపిక్.. బరువు తగ్గించడంలో వేగంగా పనితీరు కనబరుస్తున్న పానీయం ఇది. ఈ పానీయం తీసుకోవడం వల్ల కేవలం రెండు నెలల్లో దాదాపు 20కిలోల బరువు తగ్గినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పానీయం వల్ల ఎంతవరకు ఆరోగ్యంగా ఉండొచ్చనే దానిపై డైటీషియన్లు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఓట్జెంపిక్ పై..  

ఓట్జెంపిక్ పై టిక్‌టాక్‌లో బరువు తగ్గించే పానీయం అంటూ ఒకరు పోస్ట్ చేయడంతో ఆ వీడియో బాగా వైరల్ గా మారింది. ఈ డ్రింక్ తీసుకోవడం ద్వారా రెండు నెలల్లో 20కిలోల బరువు తగ్గించగలదని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొంటున్నారు. అంతేకాదు ఇతరులను 'ఓట్‌జెంపిక్ ఛాలెంజ్'ని స్వీకరించమని ప్రేరేపిస్తున్నారు.

ఎంతవరకు నిజం..? 

అయితే అధిక బరువును తగ్గించుకోవడానికి ఓట్‌జెంపిక్ డ్రింక్ ఎంతవరకూ సహాయపడుతుంది..? ఎంతవరకు నిజం..? ఈ కొత్త టిక్‌టాక్ ట్రెండ్‌ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఓట్జెంపిక్..?

ఓట్జెంపిక్ టిక్‌టాక్‌లో బరువు తగ్గించే పానీయంగా కొందరు ప్రచారం చేస్తున్నారు. అరకప్పు ఓట్స్, ఒక కప్పు నీరు, సగం నిమ్మరసంతో కూడిన ఇంట్లో తయారుచేసిన పానీయం. దీనినే "ఓట్జెంపిక్" అని అంటున్నారు. ఐతే ఇది సంపూర్ణ ఆరోగ్యవంతమైన పానీయం కాదని కొంతమంది పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. మనిషికి కావాల్సిన పోషకాలు ఈ డ్రింక్ లో లభించవని, కేవలం ఫైబర్ తోపాటు, కార్బొహైడ్రేడ్స్ మాత్రమే ఉంటాయని అందుకే దీనిని ఆమోదించలేమని వారు చెబుతున్నారు.  

ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..  

ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : weight-loss protein-overweight weight-lose weight over-weight weight-loss-tips tip-for-weight-loss weight-gain lose-weight low-carb-diet-may-be-the-key-to-sustained-weight-loss

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com