రాంచీలో బర్డ్ ఫ్లూ.. జాగ్రత్తగా ఉండాలన్న ఆరోగ్య శాఖ

షేర్ చేయండి:
రాంచీలో బర్డ్ ఫ్లూ.. జాగ్రత్తగా ఉండాలన్న ఆరోగ్య శాఖ

సాక్షి లైఫ్ : ఇటీవల ఝార్ఖండ్ లోని రాంచీలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన తర్వాత, రాంచీతో సహా ధన్‌బాద్ ప్రజలు చికెన్ తినడానికి దూరంగా ఉన్నారు. బర్డ్ ఫ్లూ ముప్పును, ప్రజల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని, ధన్‌బాద్ జిల్లా పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది. అందులో భాగంగా ప్రత్యేక చర్యలు చేపట్టింది. 
 
రాంచీలోని పౌల్ట్రీ ఫారంలో ఇతర పక్షులను పర్యవేక్షించడానికి జిల్లా స్థాయిలో ఏడుగురు సభ్యులతో కూడిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఎక్కడైనా పక్షి లేదా కోడి చనిపోయినట్లు సమాచారం అందితే విచారణ చేపడతారు. అవి చనిపోడానికి కారణాలు ఏంటి అనేదానిపై శ్రద్ధ పెట్టనున్నారు. 

 ఇది కూడా చదవండి.. ఈ సూపర్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి డోకా ఉండదు.. 

ధన్‌బాద్‌లో ఇప్పటి వరకు ఒక్క బర్డ్ ఫ్లూ కేసు కూడా నమోదు కాకపోయినా ధన్‌బాద్ వాసులు ఆందోళన చెబుతున్నారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రజలకు ఈ వ్యాధి గురించి అవగాహన కల్పిస్తున్నారు. 

ఫ్లూ లక్షణాలను గుర్తించి.. 

ధన్‌బాద్‌లో ఇప్పటివరకు ఒక్క బర్డ్ ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదు. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కోడి గానీ, మరే ఇతర పక్షి గానీ మృతి చెందినట్లు సమాచారం అందలేదన్నారు. ఫ్లూ లక్షణాలను గుర్తించి నిర్ధారించేందుకు బ్లాక్ నుంచి జిల్లా స్థాయి వరకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఆ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు. బ్లాక్ స్థాయిలో ఏర్పాటైన బృందం ప్రతిరోజు తమ ఏరియా నివేదికలను అందజేస్తుంది. బ్లాక్ నివేదిక రాంచీ ప్రధాన కార్యాలయానికి పంపడం ద్వారా ప్రతిరోజూ అప్ డేట్ అందించనున్నారు.

ధన్‌బాద్ జిల్లా స్థాయిలో ఏర్పాటైన ఏడుగురు సభ్యుల బృందంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ అలోక్ కుమార్ సిన్హా, అసిస్టెంట్ పౌల్ట్రీ అధికారి డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ భీమ్ ప్రసాద్, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ అమల, సిద్ధిఖీ ఎల్ మనోవర్, రవి చంచల్ ఉన్నారు. 

ఇది కూడా చదవండి.. న్యూ స్టడీ : యువతలో క్యాన్సర్ వేగంగా పెరగడానికి కారణాలు ఇవే.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.