జీఎస్టీ తగ్గింపు తర్వాత మందుల ఎంఆర్‌పీలో మార్పులు.. 

షేర్ చేయండి:
జీఎస్టీ తగ్గింపు తర్వాత మందుల ఎంఆర్‌పీలో మార్పులు.. 

సాక్షి లైఫ్ : జీఎస్టీ రేట్లు తగ్గించడంతో మందులు, వైద్య పరికరాల తయారీదారులు ఎంఆర్‌పీని మార్చాలని ఢిల్లీ ఔషధ నియంత్రణ విభాగం ఆదేశాలు జారీ చేసింది. కొత్త రేట్లు సెప్టెంబర్ 22 తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. తయారీదారులు స్టాంపింగ్ లేదా స్టిక్కర్ ఉపయోగించి ఎంఆర్‌పీని మార్చడానికి అనుమతించారు, అయితే దీనికి వారు ఎన్‌ఓసి పొందాలి. బిల్లింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేయాలని రిటైలర్లకు కూడా సూచించారు.

 

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇది కూడా చదవండి.. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

 

మందులు, వైద్య పరికరాల కంపెనీలకు ఎంఆర్‌పీని సవరించాలని ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ ఔషధ నియంత్రణ విభాగం.. 
 
ఢిల్లీలో మందుల ఎంఆర్‌పీలో మార్పు.. 
సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు..  
రిటైలర్లకు బిల్లింగ్ అప్‌డేట్ చేయాలని సూచన..   

 ఢిల్లీ ఔషధ నియంత్రణ విభాగం బుధవారం రాజధానిలో ఉన్న మందులు, వైద్య పరికరాల తయారీదారులు, మార్కెటింగ్ చేసేవారికి ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల తగ్గించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లకు అనుగుణంగా వారి గరిష్ఠ రిటైల్ ధర (ఎంఆర్‌పీ)ని సవరించాలని సూచించింది.

ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ 17తేదీన జారీ చేశారు. కొత్త జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఢిల్లీ పరిధిలోకి వచ్చే అన్ని మాన్యుఫ్యాక్చరర్స్, మార్కెటింగ్ చేసేవారు కొత్త జీఎస్టీ రేట్లకు అనుగుణంగా ఎంఆర్‌పీని సవరించాలని ఢిల్లీ ఔషధ నియంత్రణ విభాగం స్పష్టం చేసింది.

ప్యాకింగ్‌ను తిరిగి ముద్రించడానికి బదులుగా, స్టాంపింగ్ లేదా స్టిక్కర్ అతికించడం ద్వారా ఎంఆర్‌పీని మార్చడానికి కంపెనీలకు విభాగం వెసులుబాటు కల్పించింది. అయితే దీని కోసం వారు రాష్ట్ర ఔషధ నియంత్రణ అథారిటీ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసి) పొందవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌లో "లేబుల్‌లో ఈ సవరణ ఎంఆర్‌పీలో మార్పులకే పరిమితం అవుతుంది, లేబుల్ లోని ఇతర భాగాలను ప్రభావితం చేయదు" అని పేర్కొన్నారు.

తయారీదారులు సరఫరా గొలుసులోని అందరు వాటాదారులకు, హోల్‌సేలర్ల నుంచి రిటైలర్ల వరకు, సవరించిన ఎంఆర్‌పీని పాటించేలా చూడాలని కూడా ఆదేశించారు. మార్కెట్‌లో మందుల కొరత రాకుండా మార్పులను దశలవారీగా అమలు చేయాలని కూడా ఢిల్లీ ఔషధ నియంత్రణ విభాగం స్పష్టం చేసింది.

తయారీదారులకు మాత్రమే కాకుండా, రిటైలర్లు, హోల్‌సేలర్లకు కూడా వారి బిల్లింగ్ వ్యవస్థను, ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్లతో సహా, సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వచ్చే కొత్త జీఎస్టీ రేట్లకు అనుగుణంగా అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను ఢిల్లీ ఔషధ నియంత్రణ అధికారి, ఢిల్లీ మాన్యుఫ్యాక్చరర్ అసోసియేషన్, ఢిల్లీ కెమిస్ట్ అసోసియేషన్లకు కూడా పాటించమని కోరారు.

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.