Avoid These Foods at Night : రాత్రిపూట ఇలాంటి ఆహారాలు వద్దు... నిద్రకు, ఆరోగ్యానికి చేటు..!
సాక్షి లైఫ్ : రోజంతా పరుగులు పెట్టి, అలసిపోయి ఇంటికి చేరుకున్నాక రాత్రి భోజనం ఎంతో ఊరటనిస్తుంది. కానీ ఆ సమయంలో ఏం తింటున్నామన్నది కూడా అంతే ముఖ్యమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సరిౘైన ఆహారం తీసుకోకపోతే జీర్ణవ్యవస్థపైనే కాకుండా నిద్రపైనా, బరువుపైనా, మొత్తం ఆరోగ్యంపైనా దుష్ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. రాత్రి భోజనం వీలైనంత తేలికగా, సమతులంగా ఉండేలా చూసుకుంటే శరీరం సులభంగా జీర్ణం చేసుకుని, హాయిగా నిద్రపోయేందుకు వీలవుతుందని సూచిస్తున్నారు. మరి రాత్రిపూట ఏయే ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి.. ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. శరీరంలో ప్లేట్లెట్స్ కౌంట్ ఎంత ఉండాలి..?
ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..?
వేపుళ్లు వద్దు..
సమోసాలు, పకోడీలు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి నూనెలో వేయించిన పదార్థాల్లో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. వీటిని జీర్ణం చేసుకోవడానికి శరీరం ఎక్కువ సమయం, శ్రమ వెచ్చించాల్సి వస్తుంది. ఫలితంగా గ్యాస్, అజీర్ణం, ఎసిడిటీ వంటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. వీటికి బదులు తేలికపాటి కూరగాయల వంటకాలు, పప్పు పదార్థాలు, మల్టీగ్రెయిన్ రొట్టెలను ఎంచుకోవడం మేలు.
మసాలాలు తగ్గించాలి..
కారం, మసాలాలు ఎక్కువగా ఉండే వంటకాలు గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలను పెంచుతాయి. దీనివల్ల రాత్రి నిద్రకు కూడా భంగం కలిగే అవకాశం ఉంది. ఇంట్లోనే తక్కువ మసాలాతో వండిన ఆహారం తీసుకోవడం మంచిదని నిపుణుల సూచన.
తీపి పదార్థాలతో జాగ్రత్త..
రాత్రిపూట మిఠాయిలు, చక్కెర పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది. అదనపు కేలరీలు శరీరంలో చేరి బరువు పెరగడానికి కారణమ వుతాయి. తీపి కావాలనిపిస్తే పండ్లను మితంగా తీసుకోవడం మంచి ప్రత్యామ్నాయం.
టీ, కాఫీలకు దూరం..
రాత్రివేళల్లో టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ వంటివి తీసుకుంటే నిద్ర పట్టడం కష్టమవుతుంది. వీటిలోని కెఫిన్ శరీరంలో గంటల తరబడి చురుగ్గా ఉండి, నిద్రను దూరం చేస్తుంది. బదులుగా గోరువెచ్చని పాలు లేదా ఒంటికి సరిపడే హెర్బల్ టీ తాగడం మేలు చేస్తుంది.
శీతల పానీయాలు వద్దు..
కూల్‌డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్‌లో చక్కెర శాతం ఎక్కువగా ఉండటమే కాక, ఇవి గ్యాస్ సమస్యను కూడా పెంచుతాయి. దీనివల్ల జీర్ణక్రియతో పాటు నిద్ర కూడా దెబ్బతింటుంది. వీటికి బదులు సాదా నీళ్లు లేదా చక్కెర వేయని నిమ్మరసం తాగడం ఉత్తమం.
ప్యాకేజ్డ్ ఫుడ్‌తో ప్రమాదం..
చిప్స్, ఇన్స్టంట్ నూడుల్స్, ఇతర ప్యాకేజ్డ్ స్నాక్స్‌లో ఉప్పు, నిల్వ ఉంచే రసాయనాలు, అనారోగ్యకర కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటికి బదులు ఇంట్లో తాజాగా తయారుచేసిన ఆహారం తీసుకోవడమే శ్రేయస్కరం.
గుర్తుంచుకోవాల్సినవి..
రాత్రి భోజనాన్ని సమయానికి ముగించాలి. నిద్రపోయే ముందు కనీసం రెండు మూడు గంటల వ్యవధి ఉండాలి. ఆహారాన్ని బాగా నమిలి తినాలి.తిన్న వెంటనే పడుకోవడం మంచిది కాదు. తగినంత నీరు తాగాలి, అయితే నిద్రవేళకు ముందు మరీ ఎక్కువగా తాగకూడదు ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే రాత్రి నిద్ర బాగుండటమే కాక, మొత్తం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..సడెన్ గా డైట్ చేంజ్ చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
