Chikungunya Spreads Rapidly in Bolivia: బొలీవియాలో చికెన్‌గున్యా అత్యంత వేగంగా వ్యాప్తి.. శాంటా క్రజ్‌లో 'రెడ్ అలర్ట్'.. ఐదుగురు మృతి..!
సాక్షి లైఫ్ : దక్షిణ అమెరికా దేశమైన బొలీవియాలో చికెన్‌గున్యా వైరస్ పంజా విసురుతోంది. ముఖ్యంగా తూర్పు ప్రాంతమైన శాంటా క్రజ్‌లో ఈ వ్యాధి తీవ్రత ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ఐదుగురు మరణించగా, వేల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు. కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాంతంలో 'రెడ్ అలర్ట్' ప్రకటించింది.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?
అత్యంత వేగంగా వ్యాప్తి..
2026 ప్రారంభం నుంచి ఇప్పటివరకు సుమారు 3,938 ధృవీకరించిన కేసులు నమోదయ్యాయి. గత ఒక్క వారంలోనే 901 కొత్త కేసులు బయటపడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. బాధితుల సంఖ్య పెరగడంతో శాంటా క్రజ్‌లోని ఆస్పత్రులు తమ సామర్థ్యానికి మించి పనిచేస్తున్నాయి. పడకల కొరత వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 90 శాతానికి పైగా ఒక్క శాంటా క్రజ్ ప్రాంతంలోనే ఉండటం గమనార్హం. అందులోనూ శాంటా క్రజ్ డి లా సియెర్రా మున్సిపాలిటీలో అత్యధికంగా 55 శాతం కేసులు ఉన్నాయి.
ప్రభుత్వ చర్యలు.. నిపుణుల హెచ్చరిక..
వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి ఆరోగ్య శాఖ బృందాలు 27 ప్రభావిత మున్సిపాలిటీల్లో ముమ్మరంగా పొగ చల్లడం చేస్తున్నాయి. దోమల సంతతిని తగ్గించేందుకు నివాస ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. వర్షాలు కొనసాగితే మరో మూడు వారాల పాటు ఈ వైరస్ ఉధృతి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లక్షణాలు ఇవే.. జాగ్రత్త..!
ఏడెస్ ఈజిప్టు (Aedes aegypti) దోమల ద్వారా వ్యాపించే ఈ చికెన్‌గున్యా వల్ల ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి:
అకస్మాత్తుగా వచ్చే తీవ్రమైన జ్వరం.
కీళ్లు, కండరాలలో అసహ్యకరమైన నొప్పి.
విపరీతమైన తలనొప్పి, అలసట.
ఇంటి పరిసరాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమ తెరలు వాడటం ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని ఆరోగ్య శాఖాఅధికారులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
