హైదరాబాద్ లో భారీగా పెరిగిన డెంగ్యూ కేసులు..
సాక్షి లైఫ్ : హైదరాబాద్ నగరంలో జూలైలో డెంగ్యూ కేసులు భారీగా పెరిగాయి. కేవలం జూలైలోనే 1,300 కేసులు నమోదయ్యాయని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ వెల్లడించారు. రాష్ట్రంలో జూలై 1 నుంచి జూలై 28వతేదీ వరకు 1,345 కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. 2023లో ఇదే కాలంలో ఈ సంఖ్య 728గా ఉంది. నేషనల్ సెక్టార్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ (ఎన్ సివిబిడిసి) వెబ్‌సైట్ ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు దాదాపు 1074 కేసులను చూపుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో జూన్‌లో కేవలం 60 కేసులతో పోలిస్తే జూలైలో 206 కేసులు నమోదయ్యాయని హైదరాబాద్ డిఎమ్ హెచ్ ఓ డాక్టర్ జె. వెంకటి తెలిపారు.
ఇది కూడా చదవండి..ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..సింగర్స్ కు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది..?
ఇది కూడా చదవండి..ఎగ్ ఫ్రీజింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు..?
ప్లేట్‌లెట్స్‌కు డిమాండ్..
ప్లేట్‌లెట్స్‌కు డిమాండ్ కూడా పెరిగింది. దీంతో పలు స్వచ్చంధ సంస్థలు లాభాపేక్ష లేకుండా రక్త దానం చేస్తున్నాయి. జూలైలో నమోదైన డెంగ్యూ కేసుల్లో ఎక్కువమందికి ప్లేట్‌లెట్స్ తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జూలైలో ఎక్కువ కేసులు నమోదయ్యాయని, రాష్ట్రంలోని చాలా కేసులు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు.
సీజనల్ వ్యాధులను నివారించడానికి..
2023 జూలైలో 786 కేసులు నమోదవ్వగా, సీజనల్ వ్యాధులను నివారించడానికి జీహెచ్ ఎంసీ ఇటీవల ప్రయత్నిస్తోంది. "జ్వరం, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, దద్దుర్లు ,ముక్కు, చిగుళ్ళలో రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రతి రోజూ ఇంటింటికీ సర్వే నిర్వహించి డెంగ్యూ, సంబంధిత వ్యాధుల కేసులను నమోదు చేయాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ ప్రభుత్వ వైద్యాధికారులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?
ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ ఎలాంటి వారికి వస్తుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
