Ebola Virus : బెంగళూరులో ఎబోలా వైరస్ కలకలం : ఉగాండా మహిళకు ప్రత్యేక వార్డులో చికిత్స..!
సాక్షి లైఫ్ : ఆఫ్రికా దేశాల్లో అల్లాడిస్తున్న ప్రాణాంతక 'ఎబోలా' వైరస్ భయాలు సిలికాన్ సిటీ బెంగళూరును తాకాయి. ఉగాండా నుంచి నగరానికి వచ్చిన 28 ఏళ్ల ఓ మహిళలో ఎబోలా అనుమానిత లక్షణాలు కనిపించడంతో ఆమెను ఇందిరానగర్‌లోని ప్రభుత్వ అంటువ్యాధుల ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎబోలాపై హైఅలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఎయిర్‌పోర్టులోనే గుర్తింపు..
మే 23న సదరు మహిళ ఉగాండా నుంచి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఆ సమయంలో ఆమెకు జ్వరం వంటి స్పష్టమైన లక్షణాలు లేనప్పటికీ.. తీవ్రమైన అలసట (Fatigue) ఉన్నట్లు ఎయిర్‌పోర్ట్ ఆరోగ్య అధికారులు గుర్తించారు. ప్రాథమిక తనిఖీల అనంతరం ఆమె నగరంలోని ఒక హోటల్‌కు వెళ్లారు. అయితే, ఆ తర్వాత ఆమెకు ఒళ్లు నొప్పులు రావడంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు, ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగానే ఉందని, నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు.
ఆమెలో ఎబోలా స్పష్టమైన లక్షణాలు లేవు. కేవలం అలసట, ఒళ్లు నొప్పులు మాత్రమే ఉన్నాయి. ముందస్తు జాగ్రత్తగా రక్తం, ఇతర నమూనాలను సేకరించి పుణెలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ' (NIV) కి పంపామని, నివేదికల కోసం ఎదురుచూస్తున్నామని కర్ణాటక ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిత్విక్ రంజనం పాండే చెబుతున్నారు.
రెండు సార్లు పరీక్షలు.. నిబంధనల ప్రకారం చర్యలు..!
కేంద్ర ఆరోగ్య మార్గదర్శకాల ప్రకారం, పూణె నివేదికలో ఒకవేళ నెగెటివ్ వచ్చినా సరే.. ప్రోటోకాల్ ప్రకారం 48 గంటల తర్వాత మరోసారి నమూనాలను సేకరించి పరీక్షించనున్నారు. రెండోసారి కూడా నెగెటివ్ వస్తేనే ఆమెకు ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారిస్తారు.
ఆరోగ్య శాఖ అత్యవసర మార్గదర్శకాలు: 21 రోజుల నిఘా..!
ఈ అనుమానిత కేసు నేపథ్యంలో కర్ణాటక ఆరోగ్య శాఖ సరికొత్త ట్రావెల్ అడ్వైజరీ (మార్గదర్శకాలు) జారీ చేసింది. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు నగరానికి చేరుకున్న తర్వాత తప్పనిసరిగా 21 రోజుల పాటు తమ ఆరోగ్యాన్ని స్వీయ పర్యవేక్షణ (Self-monitoring) చేసుకోవాలి. ఆ 21 రోజుల్లో జ్వరం, ఒళ్లు నొప్పులు లేదా అలసట వంటి ఏ చిన్న లక్షణం కనిపించినా వెంటనే సమాచారాన్ని సమీప ఆరోగ్య కేంద్రానికి అందించాలి.
ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్..
అవసరమైతే బాధితుల కాంటాక్ట్ ట్రేసింగ్ (సమీప వ్యక్తుల గుర్తింపు) చేయడానికి, నిఘా ఉంచడానికి ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను రంగంలోకి దించారు.
ఆసుపత్రులు సిద్ధం..
ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు, మంగళూరులలో ప్రత్యేక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసింది. బెంగళూరులోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ డిసీజెస్‌ను 'ఐసోలేషన్ సెంటర్'గా.. ఇందిరానగర్ అంటువ్యాధుల ఆసుపత్రిని 'క్వారంటైన్ & ట్రీట్‌మెంట్' కేంద్రంగా కేటాయించారు. మంగళూరులోని శ్రీనివాస్ పోర్ట్ ఆసుపత్రిని 'క్వారంటైన్ సెంటర్'గా.. వెన్‌లాక్ జిల్లా ఆసుపత్రిని 'ఐసోలేషన్ & చికిత్స' కేంద్రంగా సిద్ధం చేశారు. ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాలలో ఎబోలా తీవ్రత దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే మే 17న దీనిని "అంతర్జాతీయ ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి"గా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్
ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
