ఢిల్లీ ఎయిమ్స్ ను విస్తరించనున్నకేంద్ర ఆరోగ్య శాఖ 

షేర్ చేయండి:
ఢిల్లీ ఎయిమ్స్ ను విస్తరించనున్నకేంద్ర ఆరోగ్య శాఖ 

సాక్షి లైఫ్ : ఢిల్లీలోని ఎయిమ్స్‌ను త్వరలో విస్తరించనున్నారు. దీని తరువాత ఇప్పుడు రోగులు, వారి కుటుంబాలు చికిత్స కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు. గత రెండేళ్లలో ఎయిమ్స్ లో పడకలు 30శాతం, ఆపరేషన్ థియేటర్ సేవలు 40శాతం పెరిగాయి. ముఖ్యంగా బయటి రోగుల కోసం సూపర్ స్పెషాలిటీ అవుట్ పేషేంట్ డిపార్టుమెంట్ (ఓపిడి)ను ఏర్పాటుచేయనున్నారు. తద్వారా రోగులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నారు.

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో ఓపి కార్డు పొందడానికి, రోగులు లేదా వారి బంధువులు ప్రతిరోజూ 12 నుంచి 14 గంటల పాటు క్యూలలో నిలబడాల్సి వస్తోంది. దీంతో ఒక్క రోజులో చాలా మంది రోగులు వైద్యుడిని సంప్రదించలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు త్వరలో ఎయిమ్స్ ని విస్తరించనున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న రోగులకు తక్కువ సమయంలో చికిత్స అందించేందుకు న్యూఢిల్లీ ఎయిమ్స్‌ను త్వరలో పెద్ద ఎత్తున విస్తరించనున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించి సంబంధిత సంస్థలతోనూ చర్చలు జరుపుతున్నామని అన్నారు. 

 
చాలా మంది రోగులకు సకాలంలో వైద్యం అందడం లేదు. రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎయిమ్స్‌ను పెద్ద ఎత్తున విస్తరించనున్నారు. ప్రణాళిక తయారు చేశామని, గత రెండేళ్లలో ఎయిమ్స్‌లో పడకల సంఖ్య 30 శాతం పెరిగిందని, ఆపరేషన్ థియేటర్ సేవలు దాదాపు 40 శాతం పెరిగాయని ఆయన చెప్పారు. ఎయిమ్స్ కి అనుబంధంగా ఉన్న మైదన్‌గర్హిలో ఉన్న ఆసుపత్రిలో ఓపిడి సౌకర్యం వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. ఇందుకోసం వైద్యుల నియామకం జరుగుతోంది. పారామిలటరీ బలగాల కోసం నిర్మించిన ఈ ఆసుపత్రిని ఎయిమ్స్ స్వాధీనం చేసుకుంది. ఎయిమ్స్ వైద్యులు ఇక్కడ సేవలు అందిస్తారు. ఇది కాకుండా 2,200 గదులతో కొత్త  కాంప్లెక్స్‌ను కూడా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. దీని అంచనా వ్యయం దాదాపు రూ.900 కోట్లు.
 

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.