H1N1అండ్ H1N2 మధ్య ఉన్న ప్రధాన తేడాలు..?
సాక్షి లైఫ్ : H1N1 అండ్ H1N2 ఇన్ఫ్లుయెంజా-ఏ (Influenza-A) కుటుంబానికి చెందిన వైరస్‌లే అయినప్పటికీ, వాటి స్వభావంలో కొన్ని ప్రధాన వ్యత్యాసాలు ఉన్నాయి. H1N1 సాధారణ స్వైన్ ఫ్లూ ప్రధానంగా మనుషులు, పందుల ద్వారా వ్యాపిస్తుంది. ఇది మనిషి నుంచి మనిషికి సులభంగా సోకుతుంది, అందుకే ఇది 2009లో మహమ్మారిగా కూడా మారింది. దీనివల్ల సాధారణం నుంచి తీవ్రమైన ఆరోగ్య సమస్యల వరకు రావచ్చు. మరోవైపు, H1N2 అరుదైన స్వైన్ ఫ్లూకి పందులు మాత్రమే ప్రధాన వాహకాలు. ఇది పందుల నుంచి మనుషులకు సోకడం చాలా అరుదు, మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందిన దాఖలాలు చాలా తక్కువ. ఈ వైరస్ సోకినప్పుడు కూడా సాధారణ ఫ్లూ లాంటి లక్షణాలే కనిపిస్తాయి. కానీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇది ప్రమాదకరంగా మారవచ్చు. చైనాలో ఇది తొలి కేసుగా నమోదైనప్పటికీ, అమెరికా, యూరప్ దేశాల్లో 2010 నుంచి 2026 మధ్య కాలంలో సుమారు 44 H1N2 కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
H1N2 వైరస్ సోకినప్పుడు కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయంటే..?
H1N2 వైరస్ సోకినప్పుడు కనిపించే లక్షణాలు దాదాపుగా మనకు వచ్చే సాధారణ ఫ్లూ లేదా జలుబు-జ్వరం లాగానే ఉంటాయి. బాధితుల్లో తీవ్రమైన జ్వరం, నీరసం, ఆకలి మందగించడం, వికారం, దగ్గు, ముక్కు కారడం, గొంతులో గరగర లేదా నొప్పి వంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. వ్యాధి సాధారణంగా ఉంటే పెద్ద ఇబ్బంది ఉండదు కానీ, కొన్ని అరుదైన కేసుల్లో వ్యాధి తీవ్రత పెరిగి ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి కూడా రావొచ్చు.
ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
ఈ వ్యాధి బారిన పడకుండా ఉండటానికి పందుల పెంపక కేంద్రాల వద్ద పనిచేసేవారు లేదా ఆ పరిసరాల్లో నివసించే చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జంతువులను తాకిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే, అనారోగ్యంతో ఉన్న లేదా చనిపోయిన పందులకు, ఇతర జంతువులకు దూరంగా ఉండటం ఎంతో ముఖ్యం.
ఎవరైనా జంతువుల సమీపంలోకి వెళ్లి వచ్చిన తర్వాత జ్వరం, దగ్గు తగ్గకుండా ఉంటే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఈ ఇన్ఫెక్షన్ ప్రస్తుతం చాలా అరుదుగా వస్తున్నప్పటికీ, భవిష్యత్తులో ఈ వైరస్ తన జన్యు రూపాన్ని మార్చుకుని మనిషి నుంచి మనిషికి సులభంగా వ్యాపించే స్థాయికి చేరితే మాత్రం ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఎప్పటికప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడమే దీని బారిన పడకుండా ఉండటానికి అసలైన మార్గం.
ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
